అనంతపురం, సెప్టెంబర్ 10:
2024 ఎన్నికలు చరిత్రను తిరగరాసాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురంలో జరిగిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” విజయోత్సవ సభలో మాట్లాడుతూ, ఈ సభ రాజకీయాలు గాని, ఓట్లు గాని కోసం కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఏర్పాటు చేశామని తెలిపారు. “సంక్షేమం అంటే ఓట్ల రాజకీయాలు కాదు, బాధ్యత. 15 నెలల పాలనలో సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం” అని అన్నారు.





గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు, అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారని, దాదాపు 93 పథకాలను నిలిపివేశారని మండిపడ్డారు. పింఛన్ల పెంపు, తల్లికి వందనం, మెగా డీఎస్సీ, దీపం, ఫ్రీ బస్సులు వంటి హామీలను సాధ్యం కాదని అప్పటి నేతలు ఎగతాళి చేశారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని స్పష్టం చేశారు. సభకు తరలి వచ్చిన ప్రజలకు, మూడు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
యువతపై విశ్వాసం వ్యక్తం చేసిన చంద్రబాబు, “యువత అండగా ఉంటే కొండనైనా ఢీకొంటాను” అన్నారు. 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేస్తే, తమ ప్రభుత్వం అంతే మొత్తంలో పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చిందని తెలిపారు. “ఇదే మన గుడ్ విల్, ఇదే మన బ్రాండ్. యువతకు ఇచ్చిన భరోసాతోనే ‘యువగళం’ సూపర్ హిట్ అయింది” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గత అక్టోబర్ 26న ప్రారంభమైన ‘టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’లో
ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు https://www.youtube.com/watch?v=ZZmc_sqgm7c పాతికమంది
వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్ https://www.youtube.com/watch?v=mfLVx7dJ-O0 దివ్యాంగ విద్యార్థుల