Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Naralokesh padayatra,Yuvaglam
Naralokesh padayatra,Yuvaglam

దర్శి నియోజకవర్గంలో హోరెత్తిన యువగళంముండ్లమూరు సభకు పోటెత్తిన జనసంద్రం

నేడు ప్రకాశంజిల్లాలో ముగియనున్న పాదయాత్ర

దర్శి: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 171వరోజు దర్శి నియోజకవర్గంలో హోరెత్తింది. యువగళం రాకతో ముండ్లమూరు దద్దరిల్లింది. గ్రామంలోని వీధులన్నీ జనమయమయ్యాయి. ముండ్లమూరు బహిరంగసభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పెద్దఎత్తున మహిళలు యువనేతకు ఎదురేగి హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. గ్రామాల్లో యువకులు, మహిళలు, వృద్ధులు యువనేతను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. మరికొద్దినెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. వేంపాడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర ముండ్లమూరు, పసుపుగల్లు, ఉల్లగల్లు మీదుగా కెలంపల్లి విడిది కేంద్రానికి చేరుకున్నారు. 171వరోజు యువనేత లోకేష్ 14.9 కి.మీ.లు పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2264.9 కి.మీ.ల మేర పూర్తయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువనేత పాదయాత్ర మంగళవారం రాత్రితో ముగిసి వినుకొండలో ప్రవేశించనుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17రోజులపాటు 220 కి.మీ. మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. 17రోజుల్లో 327మంది ప్రజలు రాతపూర్వకంగా వినతిపత్రాలు సమర్పించకోగా, వేలాదిమంది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకొని తమ కష్టాలు చెప్పుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జనం రాత్రిపొద్దుపోయే వరకు యువనేత వెంట నడిచారు. ప్రకాశంజిల్లా పార్టీ కేడర్ లో యువగళం పాదయాత్ర సరికొత్త జోష్ నింపింది.

నాసిరకం ఇళ్లు కట్టడంలో వైసీపీ  దే రికార్డు ఈదుకుంటూ వెళ్తే కానీ కనిపించని పునాదులు

డిల్లీలో రాష్ట్రం పరువుతీస్తున్న వైసిపి ఎంపీలు పార్టీని వదిలినోళ్లకు థ్యాంక్స్…వారు వెళ్లాక బలపడ్డాం

కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా

ముండ్లమూరు బహిరంగసభలో యువనేత లోకేష్

దర్శి: దర్శి నియోజకవర్గం ముండ్లమూరు బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లడుతూ… వైసీపీ సెంటు స్థలాల పేరుతో రూ.7 వేల కోట్ల స్కాం కి పాల్పడ్డాడు.  పేదలకు ఉండటానికి పనికిరాని స్థలాలు ఇచ్చాడు. ఆ స్థలాల లెవెలింగ్ పేరుతో మరో రూ.2,200 కోట్లు కొట్టేసాడు. చిన్న వర్షం వస్తేనే ఆ స్థలాలన్నీ స్విమ్మింగ్ పూల్స్ లా తయారవుతున్నాయి. .మొన్న వారం రోజులు వరుసగా వర్షాలు పడ్డాయి. సార్ సెంటు స్థలాలు అన్ని మునిగిపోయాయి పునాదులు కూడా కనపడటం లేదు అన్నాడు వైసీపీ కడుతున్న ఇళ్లు సంసారానికి పనికిరావు అని వైసిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే మరీ అంత ఘోరంగా కడుతున్నారా అనుకున్నా. కానీ ఇప్పుడు కొన్ని వీడియోలు చూసా,  చేత్తో తోస్తే గోడలు పడిపోతున్నాయి. జగన్ అంత చెత్త ఇళ్లు కడుతున్నాడు. ఇప్పటి వరకూ ఇందిరమ్మ ఇళ్లే లో క్వాలిటీ

దర్శినేలపై పాదయాత్ర చేయడం అదృష్టం

యువగళం..మనగళం..ప్రజాబలం.  దర్శి దద్దరిల్లింది. శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి దర్శి. భౌద్దారామం ఉన్న నేల దర్శి. స్వాతంత్య్రం రాకముందే ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం దర్శి. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ని గెలిపించారు.  ఎంతో ఘన చరిత్ర ఉన్న నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

రాష్ట్రం పరువు తీస్తున్నారు!

ప్రత్యేక హోదా సాధించాల్సిన వైసిపి ఎంపీలు రాష్ట్రం పరువు తీస్తున్నారు.  ఒక ఎంపీ జిప్పు విప్పి దేశం మొత్తం చూపించాడు.  ఒక ఎంపీ మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక ఎంపీ యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ చేసుకునే పనిలో బిజీ గా ఉన్నాడు. ఒక ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుకున్న కొడుకు ని కాపాడే పనిలో ఉన్నాడు.  ఒక ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్ అయితే హైదరాబాద్ పారిపోయాడు. ఏ2 ఎంపీ ఏ స్కాం లో ఎంత వచ్చిందో లెక్కలు వేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు.  ఏ1

దమ్ముంటే బిల్లులపై స్టిక్కర్లు వేయండి!

జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.

మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి

సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని మోసం చేసాడు.  2,200 కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.  మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 

యువత భవితను దెబ్బకొట్టాడు!

 జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసారు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేలు ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోటార్లకు మీటర్లు – రైతులకు ఉరితాళ్లు

జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నారు. జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

ఉద్యోగులకూ తప్పనివేధింపులు!

వైసీపీ  ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.  పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం!

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. పాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు.  అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. టిడిపి అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంది. మేం వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం.

దళితులను చంపేస్తున్నారు!

డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ వైసీపీ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్నకి టెన్షన్స్ పెరిగి ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది. జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం.

మైనారిటీలకు తప్పని చిత్రహింసలు

వైసీపీ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.

పార్టీనుంచి వెళ్లిపోయిన వారికి థ్యాంక్స్!

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ లో ఎన్నో పదవులు అనుభవించి కొంత మంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ థాంక్స్. వారు వెళ్లిపోయిన తర్వాత పార్టీ బలోపేతం అయ్యింది.

ప్రకాశం అభివృద్ధిపై చర్చకు సిద్ధం

 వైసీపీ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమను తీసుకొస్తే తన్ని తరిమేసారు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. 8వ సారి ఛాలెంజ్ విసురుతున్నా 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు చర్చకు రండి. ఎవరి హయాంలో ప్రకాశం అభివృద్ధి చెందిందో చర్చకు నేను రెడీ.

అవినీతికి కేరాఫ్ గా మార్చిన మద్దిశెట్టి

దర్శి రూపురేఖలు మార్చేస్తాడని భారీ మెజారిటీతో మీరు మద్దిశెట్టి వేణుగోపాల్ ని గెలిపించారు. దర్శి అభివృద్ధి చెందిందా?  వేణుగోపాల్ జీవితం మాత్రం మారిపోయింది. హైదరాబాద్ లో 7 కోట్లు పెట్టి విల్లా కొన్నాడు, దర్శి నియోజకవర్గంలో 80 ఎకరాల భూమి కొన్నాడు, మార్టూరు లో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కొన్నాడు. దర్శిని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాడు. అందుకే ఆయన పేరు మార్చా ఆయన పేరు వేణుగోపాల్ కాదు కలక్షన్ గోపాల్.  తమ్ముడు శ్రీధర్ తో పాటు 5 మండలాలకు ఐదుగురు బంధువులను కలక్షన్ ఏజెంట్లుగా నియమించాడు.

దర్శిలో పోస్టుకో రేటు

బోదనంపాడు గ్రామంలో సర్వే నెం. 227 లో దళితులకు చెందిన 25 ఎకరాల భూమిని కబ్జా చేసాడు కలక్షన్ గోపాల్. పోలవరం ఇసుక రీచ్ ల నుండి కోట్లాది రూపాయల ఇసుక దోచేస్తున్నాడు కలక్షన్ గోపాల్. దోపిడీ లో కలక్షన్ గోపాల్ రూటే సెపరేటు. దర్శి లో ఏ అధికారిని ఎక్కువ కాలం పనిచెయ్యనివ్వడు కలక్షన్ గోపాల్ ఎందుకో తెలుసా? ఎస్సై పోస్టు 15లక్షలు, సిఐ కి 20 లక్షలు, తహసీల్ధార్ కి 20 లక్షలు. వైసిపి సర్పంచులు, కార్యకర్తలను కూడా వదలలేదు కలక్షన్ గోపాల్. ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా లక్షకు 10 వేలు కమిషన్ ఇవ్వాల్సిందే.  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యాలన్నా కలక్షన్ గోపాల్ కి కప్పం కట్టాల్సిందే. సర్పంచ్, ఎంపిటిసి కి 20 లక్షలు, ఎంపిపి, జెడ్పిటిసి లకు 30 లక్షల నుండి కోటి రూపాయల వరకూ రేటు పెట్టి అమ్మేసాడు.

లెవెలింగ్ పేరుతో రూ.3కోట్లు స్వాహా

సింగిల్ విండో, ఏఎంసి ఛైర్మెన్ పదవులు కూడా వేలం వేసి అమ్మేసాడు. జనాలు ఉండలేని చోట సెంటు స్థలాలు ఇచ్చి లెవెలింగ్ పేరుతో రూ.3 కోట్లు కొట్టేసాడు. దర్శిలో ఎవరు వెంచర్ వెయ్యాలన్నా ఎకరానికి రూ.5 లక్షలు కప్పం కట్టాల్సిందే.  కలక్షన్ గోపాల్ రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకి ఎక్స్ పోర్ట్ చేస్తాడు. బళ్లు ఖాళీగా రాకుండా వచ్చేప్పుడు ఇతర రాష్ట్రాల లిక్కర్ తెప్పిస్తాడు. కలక్షన్ గోపాల్, ఆయన అనుచరులు కలిసి గ్రావెల్ దందా చేస్తున్నారు. కలక్షన్ గోపాల్ చేసిన అవినీతి మొత్తం చెప్పాలి అంటే ఒక రోజు పడుతుంది. గ్రామాలు, మండలాల వారీగా దోపిడీ వివరాలు త్వరలోనే మా నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతారు.

రూ.2వేల కోట్లతో అభివృద్ధిచేశాం!

దర్శిని అభివృద్ధి చేసింది టిడిపి. రూ.2 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాం. గ్రామాల్లో సిసి రోడ్లు, డబుల్ రోడ్లు, బ్రిడ్జ్ లు,పేదలకి ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. కురిచేడులో గురుకుల పాఠశాల, దర్శిలో పల్లె వనం పార్క్, పశువుల ఆసుపత్రి భవనం, ట్రెజరీ బిల్డింగ్ నిర్మించాం. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసాం. 2024 లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం. దర్శి లో టిడిపి జెండా ఎగరేయండి. దర్శి చరిత్ర లో ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తాం.

వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తాం!

అధికారంలోకి వచ్చాక దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తాం. దర్శి లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. దర్శి సమీపంలో ఉన్న ఎన్ఏపి చెరువు దగ్గర ఫిల్టర్ బెడ్స్ చెడిపోతే రిపేర్ చేసే దిక్కులేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిల్టర్ బెడ్స్ మారుస్తాం. మూసి నదిపై వంతెన నిర్మిస్తాం. వెలిగొండ పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. మొగిలి గుండాల రిజర్వాయర్ నిర్మిస్తాం. గుండ్లకమ్మ నదిపై లిఫ్ట్ ఏర్పాటు చేసి మోదేపల్లి నుండి గ్రామాలకు సాగునీరు అందిస్తాం. పొగాకు, మొక్కజొన్న, వరి, మిర్చి రైతుల సమస్యలు నేను చూసాను. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది.

కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా!

17 రోజులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించాను. 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసాను. నన్ను ప్రజలు ఆదరించారు. మీరు చూపించిన ప్రేమ ఎప్పుడూ మర్చిపోలేను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. భయం మా బయోడేటా లో లేదు. కేసులకు భయపడేది లేదు. ఎక్కువ కేసులు ఎవరి మీద ఉంటే వారికే నామినేటెడ్ పదవులు ఇస్తాం.

నారా లోకేష్ ను కలిసిన వేంపాడు రైతులు

దర్శి నియోజకవర్గం వేంపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో మాకు 400ఎకరాలు పొలం ఉంది. ఇక్కడ రైతులంతా 2ఎకరాలు పొలం ఉన్న సన్న,చిన్నకారు రైతులే. మా పొలాలకు నీరు ఇచ్చేందుకు గత ప్రభుత్వం నీటి పథకాన్ని మంజూరు చేసింది. దాని నుండే గత 20ఏళ్లుగా మాకు నీరు అందుతోంది. నీరు అందించే మోటార్లు కాలిపోయి, పైపులైన్లు పాడైపోయి నేడు ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది. దీని గురించి ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలోని నీటి ప్రాజెక్టును పునరుద్ధరించి నీరు అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ  ప్రభుత్వంలో సాగు,తాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయి. సాగునీటికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేయకుండా నిర్లక్ష్యానికి వహిస్తోంది. TDP పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేశాం. జగన్ సిఎం అయ్యాక టీడీపీ చేసిన ఖర్చులో నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదు. ఎత్తిపోతల పథకాలకు కరెంటుబిల్లులు కట్టలేక మూలనబెట్టిన దివాలాకోరు ప్రభుత్వం రాజ్యమేలుతోంది. టిడిపి అధికారంలోకి రాగానే వేంపాడు రైతులకు సాగునీరందించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పునరుద్దరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పెద ఉల్లగల్లు గ్రామస్తులు

దర్శి నియోజకవర్గం పెదఉల్లగల్లు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామ పరిధిలో సైడు కాలువలు, పశువులు ఆసుపత్రి లేవు. గ్రామంలో సాకిరేవు వాగు నుండి మధుమంచి బ్రహ్మం చేను వరకు 200ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించాలి. గ్రామంలోని అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా గాలికొదిలేశారు. పంచాయతీలకు చెందిన రూ.9వేల కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించింది. దీంతో గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి నెలకొంది. టీడీపీ పాలనలో 25వేల కిలోమీటర్ల సీసీరోడ్లు నిర్మించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైనేజీలు, పశువుల ఆసుపత్రి, సాగునీరు అందిస్తాం. దీర్ఘకాలంగా భూములు సాగుచేసుకుంటున్న వాస్తవ లబ్ధిదారులను గుర్తించి పట్టాలను అందజేస్తాం.

Also Read This Blog :Empowerment for Impact: Yuvagalam BC Meeting

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *