Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Nara Lokesh padayatra,Yuvagalam
Nara Lokesh padayatra,Yuvagalam

యువనేత లోకేష్ కు నెల్లూరు నేతల ఘన వీడ్కోలు

ఉద్వేగానికి గురైన పార్టీ నాయకులు, కార్యకర్తలు

పెండింగ్ పనుల పూర్తి, పరిశ్రమల ఏర్పాటుతో రుణం తీర్చుకుంటానన్న లోకేష్

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కందుకూరు నియోజకవర్గ సరిహద్దుల్లో రాళ్లపాడు ప్రాజెక్టువద్ద యువనేత Nara lokesh ఘనంగా వీడ్కోలు పలికారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోవూరు ఇన్ చార్జి దినేష్ రెడ్డి, ఉదయగిరి ఇన్ చార్జి బొల్లినేని రామారావు, పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, కైవల్యారెడ్డి, కోటంరెడ్డి గిరిధర్, బీద గిరిధర్, ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు యువనేతకు వీడ్కోలు పలికారు. యువనేత లోకేష్ ఉమ్మడి నెల్లూరు జిల్లాను వీడుతున్న సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్వేగానికి గురయ్యారు. పార్టీ సీనియర్ నేతలను హత్తుకొన్న యువనేత లోకేష్ జిల్లాలో టిడిపి జెండా రెపరెపలాడించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. 31రోజులపాటు తనను కుటుంబసభ్యుడి మాదిరిగా ఆదరించి ఆతిధ్యమిచ్చిన నెల్లూరు జిల్లా ప్రజలకు యువనేత లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పరిశ్రమల ఏర్పాటు ద్వారా రుణం తీర్చుకుంటానని చెప్పారు.

ప్రకాశంజిల్లాలో లోకేష్ కు అపూర్వస్వాగతం*

అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం

దారిపొడవునా కిటకిటలాడిన జనసందోహం

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విజయవంతంగా యువగళం పాదయాత్ర పూర్తిచేసిన యువనేత లోకేష్ శనివారం సాయంత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు.  కందుకూరు నియోజకవర్గ సరిహద్దుల్లోని రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద యువనేత లోకేష్ కు ఉమ్మడి ప్రకాశం జిల్లా అపూర్వ స్వాగతం పలికారు. కందుకూరు ఇన్ చార్జి ఇంటూరి నాగేశ్వర రావు, పార్టీ సీనియర్ నాయకులు  దామచర్ల జనార్ధన్, నూకసాని బాలాజీ, గొట్టిపాటి రవి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎం ఎం కొండయ్య, బి ఎన్ విజయ్ కుమార్, పోతుల రామారావు, దివి శివరాం, ఇంటూరి రాజేష్, మాల్యాద్రి, ఎరిక్షన్ బాబు, ముత్తమల అశోక్ రెడ్డి తదితరులు యువనేతను స్వాగతించారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో రాళ్లపాడు ప్రాజెక్టు పరిసరాలు కిటకిటలాడాయి.  భారీ కటౌట్లతో ఏర్పాటుచేసిన స్వాగత ద్వారాలు, గజమాలలు, బాణాసంచా మోతలు, డప్పుశబ్ధాలతో నారా లోకేష్ కి టిడిపి నాయకులు, కార్యకర్తలు. ఘన స్వాగతం పలికారు. కందుకూరు నియోజకవర్గంలో అడుగడుగునా యువనేతకు జనం నీరాజనాలు పలికారు. దారిపొడవునా యువనేత లోకేష్ తో ఫోటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు. లోకేష్ ను చూసేందుకు మహిళలు, యువకులు, చిన్నారులు పెద్దఎత్తున తరలివచ్చారు. మార్గమధ్యలో వివిధ వర్గాల ప్రజలు లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు. 155వరోజు యువనేత లోకేష్ 17.9 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2057.3 కి.మీ. మేర పూర్తయింది. ఆదివారం సాయంత్రం వలేటివారిపాలెంలో జరిగే బహిరంగసభలో  లోకేష్ ప్రసంగిస్తారు.

నారా లోకేష్ ను కలిసిన మర్రిగుంట గ్రామస్తులు

ఉదయగిరి నియోజకవర్గం మర్రిగుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మర్రిగుంట నుండి వెలిగంట్ల చర్చి రోడ్డును తారురోడ్డుగా మార్చాలి. మా గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించి మంచినీరు అందించాలి. గ్రామంలో డ్రైనేజీల్లో మురుగునీరు పేరుకుపోయింది. మా గ్రామంలో 2,500మీటర్ల సీసీ రోడ్లు నిర్మించాలి. మా గ్రామంలో పొలం వెళ్లేందుకు అవసరమైన రోడ్లు వేయాలి. ఆంజనేయస్వామి విగ్రహం నుండి చర్చి వరకు రోడ్డు వేయాలి. విగ్రహం వద్ద కరెంటు సదుపాయం ఏర్పాటు చేయాలి. మా గ్రామంలో కరెంటు సమస్యలు అధికంగా ఉన్నాయి.  మా గ్రామంలో జెడ్పి హైస్కూలుకు ప్రహరీగోడ నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. పంచాయతీలకు చెందిన రూ.9వేల కోట్లను జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది. TDP హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీరోడ్లు, 30లక్షల ఎల్.ఈ.డీ వీధి దీపాలు వేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం, కరెంటు సమస్యలు పరిష్కరిస్తాం. ప్రతిఇంటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 స్వచ్చమైన నీరు అందజేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన రెణమాల ముస్లింలు

ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం రెణమాల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉంది. రెండు రోజులకు ఒకసారి మంచినీరు వస్తోంది, ఇవి తాగడానికి ఉపయోగపడడం లేదు. మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. కొంతమంది కొనుక్కోలేక కలుషిత నీరు తాగి రోగాలబారిన పడుతున్నారు. మా గ్రామంలోని ఈద్గాకు ప్రహరీ నిర్మించి నమాజ్ చేసుకునేందుకు సౌకర్యం కల్పించాలి. మా గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు చేసి మా పిల్లలు పక్క గ్రామాలకు వెళ్లకుండా చూడాలి. మైనారిటీలకు సబ్సిడీ లోన్లు ఇప్పించి ఆర్థిక తోడ్పాటునందించాలి. మా గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

సంక్షేమ కార్యక్రమాలకు లక్షలకోట్లు ఖర్చుపెడుతున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి… గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోవడం దారుణం. టిడిపి అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ఏర్పాటుచసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. గ్రామంలో విద్యార్థులను సంఖ్యకు అనుగుణంగా హైస్కూలు, ఈద్గా ప్రహరీగోడ నిర్మాణం చేపడతాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి ముస్లింలకు స్వయం ఉపాధి రుణాలను అందజేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నేకునంపేట గ్రామస్తులు

ఉదయగిరి నియోజకవర్గం నేకునంపేట తూర్పుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి, మేమంతా వ్యవసాయంపై మేం అధారపడి జీవిస్తున్నాం. రెణమాల ట్యాంక్ గా పిలిచే చెరువు చెరువు కింద 1,300 ఎకరాల్లో వరి, పత్తి పంటలు పండిస్తున్నాం. ఈ చెరువుకు నీరు అందించాలి. కొండాపురం టు కొమ్మి రోడ్డులోని పార్లపల్లి వరకు రోడ్డు వేయాలి. దీనివల్ల 10కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రవాణా సౌకర్యం సులభమవుతుంది. తూర్పుపాళెం నుండి రెణమాల వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చిన్ననీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత నాలుగేళ్లుగా గ్రామీణరోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గత టిడిపి హయాంలో చిన్ననీటి వనరుల అభివృద్ధికి నీరు-ప్రగతి కింద రూ.18,265 కోట్లు ఖర్చుచేశాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణరోడ్లు, పుంతరోడ్ల నిర్మాణం చేపడతాం. రెణమాల చెరువుగు సాగునీరు అందజేసి, రైతుల కష్టాలు తొలగిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పెంట్రాల గ్రామస్తులు

ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పెంట్రాల పంచాయితీ చీమలపెంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నారా లోకేష్ ను కలిసిన కందుకూరు నియోజకవర్గం, పెంట్రాల పంచాయతీ, చీమలపెంట గ్రామస్తులు. మా గ్రామంలోని రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా 10గ్రామాల పరిధిలో సుమారు 4వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. వైసీపీ ప్రభుత్వం రిజర్వాయర్ కు సంబంధించిన ఎడమ కాలువ గేటు మరమ్మతులు చేయలేదు. కాలువకు అవసరమైన పూడికతీత పనులు కూడా ఏమీ చేపట్టలేదు. ఏ పని చేసినా ఆ భారాన్ని రైతులపై మోపి ఇబ్బందిపెడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక కాలువ మరమ్మతులు, పూడికతీత పనులు నిర్వహించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గత టిడిపి హయాంలో ఇరిగేషన్ పై రూ.68,294 కోట్లు ఖర్చుచేశాం. చిన్ననీటి వనరుల అభివృద్ధికి నీరు-ప్రగతి కింధ 18,265 కోట్లు వెచ్చించాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమకాల్వ గేట్ల నిర్మాణం చేపడతాం. రాష్ట్రవ్యాప్తంగా కాల్వల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టి రైతుల కష్టాలు తీరుస్తాం.

మా భూములు లాక్కొని తప్పుడు కేసులు బనాయించారు

నారా లోకేష్ ఎదుట లింగసముద్రం దళితుల ఆవేదన

మేము తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులమన్న కక్షతో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మమ్మల్ని పనిగట్టుకుని వేధిస్తున్నారు, మాకు ఇచ్చిన చెట్టుపట్టాలను రద్దుచేయించారు, అదేమని ప్రశ్నించినందుకు మాపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం దళితులు యువనేత లోకేష్ ఎదుట వాపోయారు. లింగసముద్రంకు చెందిన దళిత నాయకుడు గాలంకి ప్రసాద్ నేతృత్వంలో బాధిత దళితులు యువనేత లోకేష్ ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. 2015లో గత టిడిపి ప్రభుత్వం లింగసముద్రం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.3-8లో వనం-మనం పథకం కింద ఒక్కొక్కరికి 1.40 సెంట్ల చొప్పున 120మంది దళితులకు చెట్టుపట్టాలు ఇచ్చారు. అందులో మామిడి మేము మామిడి మొక్కలు వేసి సంరక్షించుకుంటున్నాము. 2019లో ప్రభుత్వం మారగానే మా చెట్టు పట్టాలను రద్దుచేశారు. మేం హైకోర్టుకు వెళ్లగా మాకు అనుకూలంగా తీర్పువచ్చింది. మేము టిడిపి సానుభూతిపరులమని కక్షగట్టి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వత్తిడితో ఎమ్మార్వో మాకు పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో చెట్లు లేవని నివేదిక పంపారు. దీనిపై మేము నిరసన తెలపడానికి ప్రయత్నించగా, అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్ విధించారు. మా ట్రాక్టర్ ను సీజ్ చేసి ఆరునెలలపాటు స్టేషన్ లోనే ఉంచారు. ఎమ్మెల్యే అరాచకాల నుంచి మాకు రక్షణ కల్పించి, మా భూములు, చెట్లు మాకు దక్కేవిధంగా సహకారం అందించాలని వారు కోరారు.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ఎపి చరిత్రలో తొలిసారిగా దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. దళితులకు చెందిన 12వేల ఎకరాల ఎసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుంది. తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించిన దళితులపై ఉక్కుపాదం మోపుతోంది. దళితులకు చెందాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లింగసముద్రం దళితుల భూమిని వారికి అప్పగించేలా చర్యలు తీసుకుంటాం. దళితులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేస్తాం. దళితులను పనిగట్టుకుని వేధించిన పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన లింగసముద్రం రైతులు

కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం లింగసముద్రం రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా ప్రాంతంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు నుండి లింగసముద్రం కొత్తచెరువు, పాతచెరువు, విశ్వనాథపురం చెరువులకు నీరు రావడం లేదు. ఈ చెరువుల కింద పంటలు పండాల్సిన వేలాది ఎకరాల భూమి నేడు బీడు భూములుగా మారాయి. వర్షాధార పంటలు కూడా పండే పరిస్థితులు లేవు. రైతులు కూలీలుగా మారి, భూములను వదులుకుని ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు గేటు నుండి నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. లిఫ్ట్ ద్వారా చెరువులకు నీరు ఇస్తే మా భూములకు నీరు అంది పంటలు పండించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అధికారంలోకి వచ్చాక రాళ్లపాడు ప్రాజెక్టు నుండి చెరువులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రైతుల కోసం గత ప్రభుత్వంలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కరెంటు బిల్లులు కట్టలేక మూలనబెట్టిన దివాలాకోరు ప్రభుత్వమది. గత నాలుగేళ్లులో రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాళ్లపాడు ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపడతాం. లిఫ్ట్ ద్వారా సమీప గ్రామాల చెరువులకు నీరందించే అంశాన్ని పరిశీలిస్తాం.నీరులేక రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితులను రానీయం, ప్రతిఎకరాలకు సాగునీరు అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన లింగసముద్రం బలిజపాలెం ప్రజలు

కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం బలిజపాలెం ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 300కుటుంబాలు నివసిస్తున్నాం. గ్రామంలో హిందువులకు శ్మశానవాటిక లేదు. బలిజలకు కమ్యూనిటీ హాలు లేదు. 11కేవీ విద్యుత్ లైను తీగలు బాగా కిందికి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఈ లైన్లను గ్రామం బయటినుండి వెళ్లేలా మళ్లించే చర్యలు తీసుకోవాలి. గ్రామంలో సీసీ రోడ్లు లేక వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

గత ప్రభుత్వంలో మంజూరుచేసిన కాపు, బలిజల కమ్యూనిటీ హాళ్లను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసింది.  టిడిపి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు, 30లక్షల విద్యుత్ దీపాలు ఏర్పాటుచేశాం. మళ్లీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *