Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Naralokesh padayatra,yuvagalam
Naralokesh padayatra,yuvagalam

పోటెత్తిన పొదిలి… ఎటూచూసినా జనసంద్రమే! జోరు వానలోనూ యువనేతకు అపూర్వస్వాగతం

అడుగడుగునా జననీరాజనం… వినతుల వెల్లువ

మార్కాపురం: యువనేత Nara lokesh యువగళం పాదయాత్రకు పొదిలి పట్టణంలో జనం పోటెత్తారు. లోకేష్ రాకతో పొదిలి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. జోరువానను సైతం లెక్కచేయకుండా లోకేష్ కు పొదిలి ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగత పలికారు. 162వరోజు యువగళం పాదయాత్ర పొదిలి శివారు పోతవరం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. యువనేతను చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. పొదిలి పాతబస్టాండు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. సభాస్థలికి నలుదిక్కులా రోడ్లన్నీ కిటకిటలాడాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం తెలిపారు. దారిపొడవునా పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు సమస్యలు విన్నవించుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు ఆవేదన చెందారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామని యువనేత భరోసా ఇచ్చారు. పోతవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పొదిలి పాతబస్టాండు, కాటూరివారిపాలె మీదుగా తలమళ్ల విడిది కేంద్రానికి చేరుకుంది. 162వరోజు యువనేత లోకేష్ 15.4 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2152.1 కి.మీ. మేర కొనసాగింది. ఆదివారం నాడు యువగళం పాదయాత్ర సంతనూతలపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

మార్కాపురం నేలపై పాదయాత్ర అదృష్టం

యువగళం..మనగళం..ప్రజాబలం. యువగళం కి భయం పరిచయం చేసింది. కలలో కూడా జగన్ కి లోకేషే కనపడుతున్నాడు. మార్కాపురం మాస్ జాతర అదిరిపోయింది. దేశం మొత్తం అక్షరాలు దిద్దింది మార్కాపురం పలకల పైనే. శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయం, వెలిగొండ వెంకటేశ్వరస్వామి దేవాలయం  ఉన్న పుణ్య భూమి మార్కాపురం.  ఎంతో ఘన చరిత్ర ఉన్న మార్కాపురం నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

మహిళల కన్నీళ్లు తుడిచేందుకే మహాశక్తి!

2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడవడానికే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 

యువత భవితను దెబ్బకొట్టిన వైసీపీ

వైసీపీ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

రైతుల కోసమే అన్నదాత పథకం

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. TDPఅధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

బిసిల రక్షణ కోసం ప్రత్యేకచట్టం

సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.

ప్రకాశం జిల్లాకు వైసీపీ పీకిందేమిటి?

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి.  కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు.  నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా?

ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు

నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ పాలనలో ఎత్తిపోయింది.  రాయల్టీ, కరెంట్ ఛార్జీలు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు.  దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టుని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమను తీసుకొస్తే వైసీపీ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది.

మార్కాపురంలో చోటా నయీమ్ గ్యాంగ్!

మార్కాపురంలో దొంగలు పడ్డారు. ఈ గ్యాంగ్ రాష్ట్రంలోనే అతి పెద్ద భూకుంభకోణానికి పాల్పడింది.  మార్కాపురం మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల ఉన్న రాయవరం, ఇడుపూరు, గోగులదిన్నె, గుబ్బూరు గ్రామాల్లో 378 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసారు. ఒక్కో ఎకరం విలువ ఎంతో తెలుసా?రూ. 2 కోట్లు. మొత్తం స్కాం విలువ రూ.750 కోట్లు. ఈ స్కాం వెనుక క్విడ్ ప్రో కో ఉంది మెడికల్ కాలేజ్ వస్తుందని తెలుసుకుని కుందూరు సురారెడ్డి, మస్తాన్ వలీ, ఎల్లయ్య ఇలా అనేక మంది బినామీల పేర్లతో 378 ఎకరాలు కొట్టేసారు. ఆ ఆధారాలు నేను ఈ బహిరంగ సభ వేదికగా బయటపెడుతున్నాను.

మార్కాపురంలో కుందుల-ఉడుముల ట్యాక్స్

రామచంద్రాపురంలో 5 ఎకరాలు, పెద్ద యాచవరం లో 45 ఎకరాలు, రాజుపాలెంలో 6 ఎకరాలు, మార్కాపురం టౌన్ లో 11 ఎకరాలు, చింతకుంటలో 90 ఎకరాలు, భూపతి పల్లె లో 105 ఎకరాలు, గజ్జలకొండలో 19 ఎకరాల భూమిని ఈ చోటా నయూమ్ గ్యాంగ్ కొట్టేసింది. ఆఖరికి దేవుడ్ని కూడా వదలలేదు ఈ చోటా నయూమ్ గ్యాంగ్. శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన భూమిని కొట్టేసారు. మార్కాపురం లో ప్రజలు, వ్యాపారస్తులు జిఎస్టీ తో పాటు కేయూటి కూడా కట్టాలి. చోటా నయూమ్ గ్యాంగ్ కేయూటి వసూలు చేస్తుంది. కేయూటి అంటే కుందూరు – ఉడుముల ట్యాక్స్.

చర్చి ఆస్తులు కబ్జాచేసి ఆసుపత్రి!

పొదిలిలో ఒక చర్చి కి సంబంధించిన భూమిని కబ్జా చేసి ఉడుముల ఆసుప్రతిని నిర్మించారు. వైసీపీ ఎమ్మెల్యే బావమరిది, మామ శ్రీనివాసుల రెడ్డి కలెక్ట్ చేసిన కేయూటి తో రూ.50 కోట్లు విలువైన ఉడుముల ఆసుపత్రి నిర్మించారు. పేదవాళ్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలి అంటే ఆరోగ్య శ్రీ ఈఓ గా పనిచేస్తున్న అశోక్ రెడ్డికి కేయూటి కట్టాల్సిందే. చోటా నయూమ్ గ్యాంగ్ మార్కాపురం కి డ్రగ్స్ తీసుకువస్తున్న సమయంలో దరిమడుగులో ఎస్ఈబి అధికారులు పట్టుకున్నారు. మూసి , గుండ్లకమ్మ నదుల నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదు ఈ చోటా నయూమ్ గ్యాంగ్. కృష్ణపట్నం పోర్టుకి తరలించి నెలకి కోటి కొట్టేస్తున్నారు. చోటా నయూమ్ గ్యాంగ్ గ్రావెల్ దందా, బెల్టు షాపులతో లిక్కర్ మాఫియా నడుపుతుంది.

మార్కాపురానికి ఇచ్చిన హామీలేవి?

మార్కాపురం కి అనేక హామీలు ఇచ్చాడు. వెలిగొండ పూర్తిచేసి సాగు, తాగు నీరు ఇస్తానని చెప్పాడు.  పొదిలి లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తానని అన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేస్తానని అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. మార్కాపురం ని అభివృద్ధి చేసింది టిడిపి. నారాయణ రెడ్డి నా వెంట పడి మరీ మార్కాపురం కి నిధులు తీసుకొచ్చారు. రూ.1500 కోట్లతో మార్కాపురాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగు నీటి పథకాలు, సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, పేదలకు ఇళ్లు, ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించింది టిడిపి. మార్కాపురంలో టిడిపి చేసిన అభివృద్ధి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. అందుకే వివరాలు అన్ని మీడియా కి రిలీజ్ చేస్తాను.

అధికారంలోకి వచ్చాక వెలుగొండ పూర్తి

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి పిల్ల కాలువల ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. పొదిలి మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజ్ పనులు పూర్తిచేస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.  మార్కాపురంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పనులు మనం ప్రారంభించాం. జగన్ వచ్చి ఆ పనులు ఆపేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్డ్ స్టోరేజ్ పనులు పూర్తిచేస్తాం. టిడిపి హయాంలో 4800 టిడ్కో ఇళ్లు నిర్మించాం. 10 శాతం పనులు పూర్తి చెయ్యలేని చెత్త ప్రభుత్వం ఇది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి టిడ్కో ఇళ్లు అందిస్తాం.

ఆ భూములన్నీ పేదలకు పంచుతాం

దెబ్బకి పలకల తయారీ పరిశ్రమ సంక్షభంలో పడింది. సుమారు 15 వేల మంది ఈ రంగం పై ఆధారపడ్డారు. రాయల్టీ, పన్నులు, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన పలకల తయారీ పరిశ్రమను కాపాడతాం. సబ్సిడీలు అందిస్తాం. మార్కాపురం పలకలను ప్రమోట్ చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురంలో జరిగిన ల్యాండ్ స్కాంలపై ప్రత్యేక సిట్ వేస్తాం. కొట్టేసిన ప్రతి ఎకరా వెనక్కి తీసుకుని పేదలకు పంచేస్తాం. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. మార్కాపురం లో ఉన్నా మలేషియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.

నారా లోకేష్ ను కలిసిన పోతవరం గ్రామ ప్రజలు

మార్కాపురం నియోజకవర్గం పోతవరం గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో వినాయకుడి నిమజ్జనం సమయంలో వైసీపీ వాళ్లు మాపై దాడి చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి మాపై తిరిగి పోలీసులు కేసులు పెట్టారు. మేం ఏం తప్పుచేశామని ఎస్సైని నిలదీశామని ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. 10నెలలుగా కోర్టులు చుట్టూ మేం తిరుగుతున్నాం. ఈ కేసుల్లో మహిళలను కూడా పోలీసులు ఇరికించారు. మాకు నేటికీ న్యాయం జరగలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నయాట్రెడ్ నడుస్తోంది. అధికారపార్టీ అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు వారిపైనే ఎదురుకేసులు పెడతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై విచారణ జరిపి, ఉద్యోగాలనుంచి తొలగిస్తాం. వైసిపినేతల వత్తిడితో అమాయకులపై బనాయించిన కేసులన్నీ ఎత్తేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పొదిలి 4వవార్డు ప్రజలు

పొదిలి 4వవార్డు ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వర్షాలు లేని సమయంలో కనీసం మాకు సాగు,తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. పనులకోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పొదిలి పట్టణానికి వెలుగొండ ప్రాజెక్టు నికరజలాలు కేటాయించాలి. పొదిలిలోని ముస్లిం మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటుచేయాలి. దుల్హాన్ పథకానికి చదువుతో లింకుపెట్టడంతో పేదలకు అందడంలేదు, విద్యార్హతతో సంబంధం లేకుండా పేద ముస్లింలందరికీ ఈ పథకం వర్తింపజేయాలి. పొదిలిలో గతప్రభుత్వంలో మంజూరుచేసిన షాదీఖానా పనులు వైసిపి ప్రభుత్వం వచ్చాక నిలిపివేశారు, మీరు అధికారంలోకి వచ్చాక షాదీఖానా నిర్మాణం పూర్తిచేయాలి. పొదిలి పట్టణంలో దాదాపు 3 కి.మీ.మేర ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి సర్వే కూడా పూర్తయింది. మీరు వచ్చాక బైపాస్ రోడ్డు నిర్మించాలి. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పునరుద్దరించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని దివాలాకోరు ముఖ్యమంత్రి సంక్షేమానికి లక్షలకోట్లు వెచ్చిస్తున్నానని నమ్మబలుకుతున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక పొదిలి పట్టణానికి వెలుగొండ నీళ్లుతెచ్చి, ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. పొదిలిలో నిలచిపోయిన షాదీఖానా పూర్తిచేస్తాం, విద్యార్హతలతో సంబంధం లేకుండా గతంలో మాదిరి పేద ముస్లింలందరికీ దుల్హాన్ పథకాన్ని అమలుచేస్తాం. పొదిలి పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్లను బలోపేతం చేసి సబ్సిడీ రుణాలను అందజేస్తాం.

లోకేష్ ను కలిసిన కాటూరివారిపాలెం గ్రామస్తులు

పొదిలి నగరపంచాయితీ కాటూరివారిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 200 ఎస్టీ, 150 ఎస్సీ, 150 బిసి కుటుంబాలు ఉన్నాయి. వీరికి 1986లో టిడిపి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు తప్ప ఎటువంటి కనీస వసతులు లేవు. బిసి కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏడాదికాలంగా మంచినీటి సరఫరా నిలిపివేయడంతో నీరు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. టిడిపి ప్రభుత్వం వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ఆయా వర్గాల అభివృద్ధికి ఖర్చుచేయాల్సిన సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు. స్థానిక సంస్థల్లో బ్లీచింగ్ పౌడర్, కరెంటు బిల్లులకు కూడా నిధుల్లేని దుస్థితి కల్పించారు. కేవలం పన్నుల బాదుడు కోసం శివారు గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపి, మౌలిక సదుపాయాలను పట్టించుకోలేదు. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కాటూరివారిపాలెంలో రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు కల్పిస్తాం.

Also Read This Blog :Youthful Footprints: Yuvagalam Padayatra Spurs Socio-Political Awakening in Andhra Pradesh

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *