ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విజయవంతంగా పూర్తయిన యువగళంయువనేత లోకేష్ కు ఉమ్మడి గుంటూరునేతల అపూర్వ స్వాగతంవినుకొండ నియోజకవర్గంలో తొలిరోజు వెల్లువెత్తిన జనప్రవాహం
వినుకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17రోజులపాటు దుమ్మురేపిన Nara Lokesh యువగళం పాదయాత్ర… మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. తొలిరోజు వినుకొండ నియోజకవర్గంలో వేలాది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం వద్ద పల్నాడు జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు నేతృత్వంలో యువనేతకు ఘనస్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనాలతో యువనేతను పల్నాడు జిల్లా ప్రజలు స్వాగతించారు. యువగళానికి సంఘీభావంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నాలక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్, కోవెలమూడి రవీంద్ర, నజీర్ అహమ్మద్, వేగేశన నరేంద్ర వర్మ, మన్నవ మోహనకృష్ణ, చదలవాడ అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, కందుకూరి వీరయ్య, గోనుగుంట్ల కోటేశ్వర రావు, పోతినేని శ్రీనివాస్ తదితరులు యువనేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. వినుకొండ కార్యకర్తలు భారీ గజమాలలు, స్వాగతద్వారాలు, బాణాసంచా మోతలతో హోరెత్తించారు. దారిపొడవునా మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీస్తూ హారతులుపడుతూ యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. దర్శి నియోజకవర్గం కెలంపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముప్పరాజుపాలెం వద్ద వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి రాముడుపాలెం, జెసి నగర్, రవ్వవరం, పుచ్చనూతల, కొత్తరెడ్డిపాలెం, లక్ష్మీపురం, నూజెండ్ల మీదుగా గుర్రపునాయుడుపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది. 172వరోజు యువనేత లోకేష్ 18.6 కి.మీ. ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2283.5 కి.మీ.ల మేర పూర్తయింది. బుధవారం సాయంత్రం వినుకొండ ఎన్టీఆర్ సర్కిల్లో జరిగే బహిరంగసభలో లోకేష్ ప్రసంగించనున్నారు.
ప్రకాశంజిల్లా నేతల ఘన వీడ్కోలు
వినుకొండ నియోజకవర్గ శివార్లలో యువనేతకు ప్రకాశం నేతలు వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, విజయకుమార్, ఎరిక్షన్ బాబు, కందుల నారాయణరెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, దర్శి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ముప్పరాజుపల్లి వద్దకు చేరుకున్నారు. ప్రకాశం జిల్లా టిడిపి నాయకులు యువనేతను హత్తుకొని ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తనను తోబుట్టువులా ఆదరించిన ప్రకాశం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఏ కష్టమొచ్చినా పార్టీ కేడర్ కు వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. యువగళం స్పూర్తితో రాబోయే ఎన్నికల్లో పసుపుజెండా రెపరెపలాడాలని చెప్పారు. నాయకులంతా కలసికట్టుగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించాలని కోరారు.
ఇన్ ఛార్జి లేకపోయినా దర్శిలో యువగళం సూపర్ హిట్దర్శి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు అభినందనలుత్వరలో బలమైన అభ్యర్ధి…మంచి మెజార్టీతో గెలిపించండి దర్శి నియోజకవర్గ నాయకులతో యువనేత లోకేష్ భేటీ
దర్శి: ఇంఛార్జ్ లేకపోయినా దర్శిలో నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో యువగళం పాదయాత్రను సూపర్ హిట్ చేశారని యువనేత నారా లోకేష్ సంతోషం వ్యక్తంచేశారు. వినుకొండ నియోజకవర్గం పుచ్చనూతలలో దర్శి నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జుల లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. లోకేష్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరిలో పట్టుదల ఉంది. దర్శిలో మనం గెలవబోతున్నాం…మంచి మెజారిటీ సాధించాలి. నిత్యం ప్రజల్లో ఉండే బలమైన అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం.
ఎన్నికల తర్వాత ఇన్చార్జి వ్యవస్థ ఉండదు!
2024 ఎన్నికల తర్వాత ఇంఛార్జ్ ల వ్యవస్థ ఉండదు. మండల, గ్రామ కమిటీలను బలోపేతం చేస్తాం. మండలాలు, క్లస్టర్లలో బాధ్యులు పార్టీని పటిష్టం చేయాలి. కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పని చేయండి. భవిష్యత్తకు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. వర్గ విభేధాలుంటే పక్కన పెట్టాల్సిందే. పంచాయతీ ఎన్నికల్లో బాగా ఇబ్బంది పడ్డారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంద పెట్టింది. తప్పుడు కేసులతో మిమ్మల్ని వేధించింది. సీఎం సామాజికవర్గంలోనూ జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. దొంగ ఓట్లపై దృష్టి పెట్టండి. మీరు అప్రమత్తంగా ఉంటే ప్రజల ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్చడం కుదరదు. పార్టీ తరపున చేయాల్సిన కార్యక్రమాలపై ఇక గట్టి ఫోకస్ పెట్టాలని లోకేష్ కోరారు.
నారా లోకేష్ ను కలిసిన ముప్పరాజుపాలెం గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో 400 కుటుంబాలున్నాయి…తీవ్రమైన నీటిఎద్దడి ఉంది. ఫ్లోరైడ్ సమస్యతో నడుముల నొప్పులు, గారపళ్లు, మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాం. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి, ప్రతి ఇంటికీ కుళాయి సదుపాయం కల్పించాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
రాష్ట్రంలో ప్రజలకు గుక్కెడు నీళ్లందించడం చేతగాని ముఖ్యమంత్రి లక్షలకోట్లతో సంక్షేమం చేశానని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పించుకునేందుకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఈ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోంది. జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. TDP అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్చమైన మంచినీరు అందిస్తాం. వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన రాముడుపాలెం గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం రాముడుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాముడుపాలెం, పుచ్చనూతల పంచాయతీల్లో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. ఫ్లోరైడ్ నీటి వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నాం. మా గ్రామంలో 300కుటుంబాలు నివసిస్తున్నాం. ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించాలి. మా ప్రాంతం మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వ్యవసాయం, కూలీపనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాభివృద్ధికి గ్రహణం పట్టింది. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.9వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం దొంగిలించింది. పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా చిల్లిగవ్వ లేని దుస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీరోడ్లు వేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక రాముడుపాలెం గ్రామానికి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షిత నీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా అందిస్తాం. వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన పుచ్చనూతల జెసి నగర్ వాసులు
వినుకొండ నియోజకవర్గం పుచ్చనూతల జెసినగర్ వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మాకు శ్మశాన వాటికలు లేక వాగుల్లో మృతదేహాలను ఖననం చేస్తున్నాం. శ్మశాన వాటిక స్థలం కోసం ఎంతలా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇళ్ల పట్టాల కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఇవ్వడం లేదు. స్థలాలు లేక ఇళ్లు నిర్మించుకోవాలంటే భారంగా ఉంది. ఖాళీ ప్రభుత్వ భూములను వ్యవసాయం చేసుకునేందుకు కేటాయించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవు. దీంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో లేక బయట నుండి కొనుగోలు చేస్తున్నాం. చేపలు పట్టుకునేందుకు వలలు, ఐస్ బాక్సులు అందించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిస్కీమ్ లోనూ ఒక స్కామ్ ఉంటుంది. సెంటుపట్టాల పేరుతో పనికిరాని స్థలాలను కేటాయించి రూ.7వేల కోట్లు దోచుకున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ప్రతిపేదవాడికి ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తాం. జెసినగర్ లో శ్మశానవాటికకు స్థలాన్ని కేటాయిస్తాం. జగన్ దివాలాకోరు ప్రభుత్వం కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో దూది, గాజుగుడ్డ కూడా లేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలను మెరుగుపరుస్తాం. ఆదరణ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టి మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు సబ్సిడీపై అందిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన రవ్వవరం గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం రవ్వవరం గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. టీడీపీ హయాంలో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. సైడు కాలువలు నిర్మించే సమయంలో ప్రభుత్వం మారాక పనులు చేపట్టలేదు. గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. పొలాలకెళ్లే రోడ్లు సరిగా లేక ఇబ్బంది పడుతున్నాం. అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసీపీ దివాలాకోరు పాలనలో గ్రామీణ రోడ్లు తటాకాలను తలపిస్తున్నాయి. గ్రామపంచాయితీలకు చెందిన నిధులను వైసీపీ ప్రభుత్వం దొంగిలించడంతో అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గ్రామాలనుంచి పొలాలకు వెళ్లే పుంతరోడ్ల నిర్మాణం చేపట్టి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన లక్ష్మీపురం గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. గ్రామానికి పంచాయతీ నిధులను ఈ ప్రభుత్వం కేటాయించడం లేదు. 500 మీటర్లు మేర సైడు కాల్వలు అవసరం ఉంది. ఎస్సీ, బీసీలకు టీడీపీ హయాంలో ఇళ్లు నిర్మించారు. ఈ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడం లేదు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి. రూ.650 ఉన్న గ్యాస్ రూ.1200కి పెరిగింది. విద్యుత్ ఛార్జీలు పెరుగుదల పేదలకు భారంగా ఉంది. బస్ ఛార్జీలు బాగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసీపీ ప్రభుత్వానికి పన్నుల బాదుడుపై ఉన్న సౌకర్యాల కల్పనపై లేదు. గ్రామ పంచాయతీలకు చెందన రూ.9 వేల కోట్లను ఈ ప్రభుత్వం దొంగిలించింది. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రామాలకు చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొంది. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతిఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం వైసీపీ అధికారంలోకి వచ్చాక 9 విద్యుత్ ఛార్జీలు, 3సార్లు ఆర్టీసి చార్జీలు పెంచి జనం నడ్డివిరిచారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం విధించిన అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షించి, ఉపశమనం కలిగిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన నూజెండ్ల గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది, మా మండలం ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం కావడంతో నిత్యం అనారోగ్యాలకు గురవుతున్నాం. గ్రామంలో డ్రైనేజీలు లేక మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామం నాగార్జునసాగర్ ఆయకట్టు చివరిప్రాంతంలో ఉండటంతో సాగునీటి సమస్య ఉంది. ప్రకాశంజిల్లా నుండి సాగర్ నీరు వచ్చి మా ప్రాంతంలో రెండు కాలువలుగా విడిపోయి గుంటూరుకు కూడా నీరు వెళుతుంది. ప్రకాశంజిల్లా నుండి మా ప్రాంతానికి నీరు రాకుండా ఎగువ రైతులు అడ్డుకుంటున్నారు. నీరు అందక పంటలు దెబ్బతినడంతో జీవనోపాధి కోసం వలసలు వెళ్లాల్సివస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
వైసీపీ చేతగాని పాలన రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది. జల్ జీవన్ మిషన్ అమలులో బీహార్ కంటే ఏపీని వెనుకంజలో నిలబెట్టిన దద్దమ్మ జగన్. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నీ పునరుద్ధరిస్తాం. సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టి కాల్వల చివరి వరకు రైతులకు సాగునీరు అందిస్తాం. వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందజేసి వలసలను నివారిస్తాం.
లోకేష్ ను కలిసిన గుర్రపునాయుడుపాలెం గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం గుర్రపునాయుడుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. సాగర్ కాల్వలను అభివృద్ధిచేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు నీళ్లు అందించాలి. గ్రామంలో రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలను పూర్తిగా గాలికొదిలేశారు. అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. గత నాలుగేళ్లుగా ఇరిగేషన్ వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు. టిడిపి హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294 కోట్లు ఖర్చుపెడితే, ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగోవంతు ఖర్చుచేయలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ కుళాయిని అందజేసి స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. గ్రామ పంచాయితీలకు అదనపు నిధులు కేటాయించి మౌలిక సదుపాలను కల్పిస్తాం. సాగర్ కాల్వల ఆధునీకరణ ద్వారా సాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.
Also Read This Blog :Inspiring Change: Naralokesh’s Padayatra Impact Stories
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh