Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
nara lokesh padayatra,yuvagalam
nara lokesh padayatra,yuvagalam

సంతనూతలపాడులో ఉత్సాహంగా యువగళం అడగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు

ఆప్యాయంగా పలకరిస్తూ, భరోసా ఇస్తూ ముందుకు సాగిన యువనేత

సంతనూతలపాడు: సంతనూతలపాడు నియోజకవర్గంలో 165వరోజు యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. సంతనూతలపాడు శివారు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలనుంచి అపూర్వ స్పందన లభించింది. సంతనూతలపాడు పెద్దఎత్తున మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతూ స్వాగతించారు. బైక్ మెకానిక్ లతో సమావేశమైన యువనేత వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. వివిధ వర్గాల ప్రజలు యువనేతకు తమ కష్టాలు చెప్పుకోగా, మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. సంతనూతలపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర… ఎండ్లూరు, పేర్నమిట్ట మీదుగా ఒంగోలు శివారు పాలకేంద్రం విడిది కేంద్రానికి చేరుకుంది. 165వరోజు యవనేత లోకేష్ 11.3 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2189.1 కి.మీ. మేర పూర్తయింది. బుధవారం ఒంగోలు మంగమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు. 27వతేదీన ఒంగోలు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట ప్రాంగణంలో జయహో బిసి కార్యక్రమం నిర్వహిస్తారు.

బైక్ మెకానిక్ లకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేస్తాం ప్రభుత్వ గుర్తింపుకార్డులు, వైద్యబీమా కల్పిస్తాం

మెకానిక్ లతో చిట్ చాట్ లో యువనేత లోకేష్

సంతనూతలపాడు: కోవిడ్ దెబ్బ కి ఆదాయాలు తగ్గి టూ వీలర్ అమ్మకాలు తగ్గాయి. దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏపి లో ఉన్నాయి. కరోనా కంటే ముందు జగరోనా వైరస్ వచ్చింది. మరో 9 నెలల్లో జగరోనా వైరస్ కి వ్యాక్సిన్ వస్తుందని యువనేత Nara lokeshపేర్కొన్నారు. సంతనూతలపాడులో బైక్ మెకానిక్ లతో యువనేత లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… నేను బైక్ మెకానిక్స్ తో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నా అని తెలిసి బైక్ మెకానిక్స్ ని కూడా షాపులు మూసేయాలని వైసిపి నాయకులు బెదిరించారు. పాదయాత్ర లో బైక్ మెకానిక్స్ ఎంతో మంది నన్ను కలిసి బాధలు చెప్పుకున్నారు. బైక్ మెకానిక్స్ కూడా జగన్ బాధితులే.

కొత్త టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ

నేడు అనేక కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. బీస్ 5, బిఎస్ 6, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా బైక్ మెకానిక్స్ కి శిక్షణ ఉచితంగా ప్రభుత్వాలు అందించాలి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా లేదా పార్లమెంట్ ని యూనిట్ గా తీసుకొని బైక్ రిపేర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అధునాతన పనిముట్లు అందిస్తాం. మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కార్పొరేషన్లు ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్ మెకానిక్స్ ని గుర్తిస్తాం. బైక్ మెకానిక్స్ కి ప్రభుత్వ గుర్తింపు కార్డు లు అందజేస్తాం. వైద్య సాయం, చంద్రన్న భీమా బైక్ మెకానిక్స్ కి అమలు చేస్తాం.

నేను చిన్నప్పుడే కారు తయారుచేశా!

నేను చిన్నప్పుడు కార్ కూడా తయారు చేసాను. నాకు ఒక మెకానిక్ ఫ్రండ్ ఉంటే అతని దగ్గర బైక్ ఇంజిన్ తీసుకొని ఇద్దరు ప్రయాణం చేసేలా కారు తయారు చేసాను. అది ఇప్పటికి నా దగ్గర ఉంది. చిన్నప్పుడు చెయ్యాల్సిన సరదా పనులు అన్ని చేశాను. కాలేజ్ కి బంక్ కొట్టి సినిమాకి వెళ్లి ఇంట్లో దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. అమ్మ కొట్టిన సందర్బాలు కూడా ఉన్నాయి. బైక్ నడపడం నాకు ఇష్టం. ఎన్నో సార్లు బైక్ రిపేర్ వచ్చినప్పుడు మెకానిక్ దగ్గరకి రిపేర్ కి తీసుకువెళ్ళాను.

పేదరికంలేని సమాజమే లక్ష్యం

పేదరికం లేని రాష్ట్రం టిడిపి లక్ష్యం. స్వయం ఉపాధి కి పెద్ద పీట వేస్తాం. ఏ ఊరు వెళ్ళినా ముందు కనపడేది మెకానిక్ షెడ్లే. మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా బైక్ మెకానిక్స్ కి నైపుణ్య శిక్షణ ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్ మెకానిక్స్ ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటాం. బైక్ మెకానిక్స్ సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశం పై పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కొన్నిలక్షల మంది ఆధారపడిన బైక్ మెకానిక్ రంగాన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటాం.

మోటారు మెకానిక్ లు మాట్లాడుతూ…

బిఎస్ 5, బిఎస్ 6 ఇంజిన్లు వస్తున్నాయి. వాటిని రిపేర్ చెయ్యడం మాకు తెలియడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. నూతన టెక్నాలజీ కి తగ్గట్టుగా మాకు అధునాతన పనిముట్లు అందించాలి. మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఈ రంగం పై ఆధారపడి ఉన్నాం. మాకు ప్రభుత్వం నుండి కనీసం గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యడం లేదు. కాలేజ్ బంక్ కొట్టి బైక్ పై సినిమాకి ఎప్పుడైనా వెళ్ళారా? టిడిపి హయాంలో భవన నిర్మాణ కార్మికులను ఎలా అయితే ఆదుకున్నారో అలా బైక్ మెకానిక్స్ ని కూడా ఆదుకోవాలి. బైక్ మెకానిక్స్ కి కార్పొరేషన్ లేదా సొసైటీ ఏర్పాటు చెయ్యాలి.

నారా లోకేష్ ను కలిసిన సంతనూతలపాడు గ్రామస్తులు

సంతనూతలపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. TDP హయాంలో సంతనూతలపాడు, పరిసర 4గ్రామాలకు నీరు ఇచ్చే ప్రాజెక్టుకు రూ.5.70కోట్లు మంజూరు చేశారు. టెండర్లు పిలిచి, పనులు మొదలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఓహెచ్ఆర్ ట్యాంకులు రెండు మొదలుపెట్టి సగం పనులు పూర్తిచేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులన్నీ నిలిపేశారు. సురక్షిత మంచినీరు అందక ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రవాటా చెల్లించలేక పథకాన్ని మూలనపడిన వైసీపీ . 2021 నుంచి జల్ జీవన్ మిషన్ ను ఎపి వినియోగించుకోలేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి చెప్పడం దివాలాకోరు పాలనకు అద్దంపడుతోంది. జలజీవన్ మిషన్ పథకం అమలులో బీహార్ కంటే ఏపీని వెనుక నిలబెట్టిన ఘనత జగన్ దే. మేం అధికారంలోకి వచ్చాక సంతనూతలపాడులో నిలిచిపోయిన మంచినీటి ప్రాజెక్టు పనులను పూర్తిచేస్తాం. ఇంటింటికీ కుళాయి అందజేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన మంగమూరు గ్రామస్తులు

సంతనూతలపాడు నియోజకవర్గం మంగమూరు గ్రామస్తులు యవనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 5వేల జనాభా నివాసం ఉంటున్నాం. గ్రామంలో గ్రౌండ్ వాటర్ సౌకర్యం లేదు. పంచాయితీ నీటి సరఫరా పైనే ఆధారపడ్డాం. మాకు సరఫరా చేసే నీటిని ఫిల్టర్ చేయకుండా ఇస్తున్నారు. దీనివల్ల నిత్యం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక గ్రామంలోని అన్ని ప్రాంతాలకు సురక్షిత నీటిని అందించాలి. ఎస్సీ కాలనీకి నీటి సరఫరాను పునరుద్ధరించాలి. ఒంగోలు నుండి మంగమూరు రోడ్డులోని నల్లవాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. మంగమూరు నుండి చండ్రపాలెం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డులో 10వ కిలోమీటర్ వద్దనున్న సాగర్ కాలువపై తారురోడ్డు నిర్మించాలి. ఈ మార్గంలో బస్సు సౌకర్యం ఏర్పాటుచేస్తే ప్రజలకు రాకపోకలకు సమస్య తొలగిపోతుంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ దివాలాకోరు పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభ్రమైన నీరు అందించే పరిస్థితి లేదు. పంచాయితీలకు చెందిన రూ.9వేల కోట్ల నిధులను దారిమళ్లించడంతో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి నెలకొంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా స్వచ్చమైన తాగునీరు అందించాం. మేం అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి సురక్షితమైన తాగునీరు అందిస్తాం. నల్లవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. సాగర్ కాలువపై తారురోడ్డు నిర్మించి,రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం.

నారా లోకేష్ ను కలిసిన ఎండ్లూరు గ్రామస్తులు

సంతనూతలపాడు నియోజకవర్గం ఎండ్లూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 5వేల జనాభా నివాసం ఉంటున్నాం. గ్రామంలోని చెరువు క్రింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి ఉంది.  వర్షాలు పడని సమయంలో పంటపొలాల్లో పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. మా గ్రామంలో సాగు, తాగు నీటికి చెరువునీరే ఆధారంగా ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ చెరువుకు ఎన్.ఎస్.పి కాలువ ద్వారా నీరు అందించాలి. మా గ్రామంలోని జామాయిల్, సుబాబుల్ రైతులు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారు. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. పంట పొలాలకు డొంకరోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో చిన్ననీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రజలకు తాగు, సాగు నీరు అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో చిన్ననీటి వనరుల అభివృద్ధి రూ.18,265 కోట్లు ఖర్చుచేశాం. మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చాక సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టి, గొలుసుకట్టు చెరువులకు నీరు అందజేస్తాం. సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. పంట పొలాలకు వెళ్లే పుంతరోడ్ల నిర్మించి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పేర్నమిట్ట గ్రామస్తులు

సంతనూతలపాడు నియోజకవర్గం పేర్నమిట్ట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా ప్రాంతంలో 200ఎకరాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు చేతులు మీదుగా పాలఫ్యాక్టరీ పెట్టారు. ఈ ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా 500మంది ఉపాధి పొందేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఫ్యాక్టరీని అమూల్ కంపెనీకి కట్టబెట్టారు. పాల కంపెనీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ వెయ్యి కుటుంబాల జీవనోపాధిపై దెబ్బకొట్టారు. మీరు అధికారంలోకి ఈ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకొచ్చి మా ప్రాంతం ప్రజలను ఆదుకోవాలి. పీర్లమాన్యం ప్రాంతంలోని వెయ్యి ముస్లిం కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ స్వార్థప్రయోజనాల కోసం వేలాది పాడిరైతులు, కార్మికులకు ప్రయోజనాలను ఫణంగా పెట్టి వేలకోట్ల ఆస్తులున్న ఒంగోలు ఫ్యాక్టరీని అమూల్ కు కట్టబెట్టారు. కొత్తగా ఉపాధి అవకాశాలు పెంచాల్సిన ప్రభుత్వం ఉన్న ఉపాధి మార్గాలను దెబ్బతీయడం దారుణం. టీడీపీ పాలనలో 40వేల పరిశ్రమలు ద్వారా 6లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒంగోలు డైరీ, పాలపొడి ఫ్యాక్టరీలను పునఃప్రారంభిస్తాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లస్థలాలతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తాం. పీర్లమాన్యంలో దీర్ఘకాలంగా నివసిస్తున్న ముస్లిములకు శాశ్వత ఇళ్ల పట్టాలకు చర్యలు తీసుకుంటాం.

Also Read This Blog :Youthful Footprints: Yuvagalam Padayatra Spurs Socio-Political Awakening in Andhra Pradesh

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *