Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
NaraLokesh padayatra,Yuvagalam
NaraLokesh padayatra,Yuvagalam

వినుకొండలో జనసంద్రంగా మారిన యువగళం లోకేష్ రాకతో కిటకిటలాడిన ప్రధాన రహదార్లు

అడుగడుగునా యువనేతకు అపూర్వస్వాగతం

వినుకొండ: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ పట్టణం జనసంద్రంగా మారింది. యువనేత రాకతో పసుపుజెండాలు, యువగళం పతాకాల రెపరెపలతో వినుకొండ హోరెత్తింది. 173వరోజు యువగళం పాదయాత్ర గుర్రపునాయుడుపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం భోజన విరామానంతరం వినుకొండలోకి అడుగుపెట్టగా, లోకేష్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనంతో రోడ్లన్నీ కిటకిటలాడాయి. వినుకొండ నలుదిక్కులా కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వినుకొండ జనప్రభంజనంతో మారుమోగింది. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ను చూసేందుకు జనం భవనాలు, బస్సులు, బ్రిడ్జిలపైకి ఎక్కారు. యువనేతను కలిసేందుకు మహిళలు, యువకులు పొటీపడ్డారు. వేలసంఖ్యలో జనం రోడ్లపైకి రావడంతో అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. అడుగడుగునా మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీస్తూ హారతులుపడుతూ నీరాజనాలు పట్టారు. జయహో లోకేష్ నినాదాలు, బాణా సంచా మోతలతో వినుకొండ పట్టణం దద్దరిల్లింది. వినుకొండ ఎన్టీఆర్ సర్కిల్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. కనీవినీ ఎరుగనిరీతిలో ప్రజలు యువగళానికి సంఘీభావంగా తరలిరావడంతో నాయకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గుర్రపునాయుడుపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఉప్పలపాడు, చాట్రగడ్డపాడు, వినుకొండ పట్టణం గుండా నగరాయపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది. 173వరోజు యువనేత లోకేష్ 16.1 కి.మీ.ల దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2299.6 కి.మీ.ల మేర పూర్తయింది. గురువారం యువగళం పాదయాత్ర కొండ్రముట్లలో 2300 కి.మీ.ల మైలురాయికి చేరుకోనుంది.

పునరావాస కేంద్రాల్లో పాచిపోయిన అన్నం కరెంటు బిల్లు పట్టుకుంటేనే జనానికి షాక్

మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి కబ్జాలరాయుడుగా మారిన ఎమ్మెల్యే బొల్లా

యాత్రను అడ్డుకుంటే వైకాపాకి అంతిమయాత్రే! వినుకొండ బహిరంగసభలో యువనేత లోకేష్

వినుకొండ: వినుకొండ ఎన్టీఆర్ సర్కిల్ లో జరిగిన భారీ బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ… వైసీపీ ఇసుక కోసం ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. స్వర్ణముఖిన‌దిలో 10 అడుగులు త‌వ్వాల్సిన చోట 30 అడుగుల లోతు తవ్వేసారు. చంద్ర‌గిరి మండ‌లం రెడ్డివారిప‌ల్లె స్వర్ణముఖి న‌ది ఇసుక గుంతలో పడి యువకుడు కార్తీక్ చనిపోయాడు. వైసీపీ  ఇసుక మాఫియా త‌వ్విన గుంతల్లో ప‌డి వంద‌ల మంది ప్రాణాలు పోయాయి..

వరద బాధితుల వద్దకువెళ్లే తీరికలేదా?

వైసీపీకి పేదలంటే కోపం. నేను ముందే చెప్పా జరగబోయేది పేదలకు, దోపిడీదార్లకు మధ్య యుద్ధం అని. ఇప్పుడు అదే నిజం అయ్యింది. వరదల్లో చిక్కుకున్న వారిని కనీసం పరామర్శించడానికి ఆయనకి మనస్సు రాలేదు. వేరే పనులకు ఆయనకు టైం ఉంది. కానీ వరద మీద సమీక్ష చెయ్యడానికి టైం లేదు. బాధితుల్ని పరామర్శించడానికి టైం లేదు. వరద తగ్గాక నిత్యావసర సరుకులు ఇస్తాం అంటుంది ఈ ప్రభుత్వం. అప్పటి వరకూ పేద ప్రజలు ఏం తినాలి? ఇళ్ళన్నీ నీట్లో మునిగిపోయాయి. ప్రజలు బాధల్లో ఉంటే చూసి నవ్వుకునే సైకో మనస్తత్వం వైసీపీ ది. అదే చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు వరద వస్తే అధికారుల కంటే ముందు ఆయనే అక్కడ ఉండి ఆదుకునే వారు. పేదలపై ప్రేమ అంటే అది.

వినుకొండగడ్డపై పాదయాత్ర అదృష్టం

యువగళం,మనగళం,ప్రజాబలం. చిత్తూరు జనసంద్రంగా మారింది, అనంతపురం అదిరిపోయింది, కర్నూలు కదం తొక్కింది, కడప కసి పెంచింది , ప్రకాశంలో జనసునామి, ఇప్పుడు గుంటూరు గర్జించింది. పౌరుషాల గడ్డ పల్నాడు. శ్రీరాముడు అడుగుపెట్టిన పుణ్యభూమి వినుకొండ.  శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, జామియా మస్జీద్ ఉన్న నేల వినుకొండ. గొప్ప కవి గుర్రం జాషువా జన్మించిన గడ్డ వినుకొండ. ఎంతో ఘన చరిత్ర ఉన్న వినుకొండ నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

అడ్డుకుంటే వైకాపాకి అంతిమయాత్రే!

 యువగళాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు. పోలీసుల్ని పంపాడు మనం తగ్గేదేలేదు అన్నాం. మైక్ వెహికల్ లాక్కున్నాడు. ఇది స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు. మధ్యలో ఫ్లెక్సీలు పెట్టాడు మన వాళ్లు చించేసారు. వాళ్లు గుడ్లు వేసారు మన వాళ్లు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. వినుకొండలో  ఫైరింగ్ వరకూ వచ్చింది. బాంబులకే భయపడం…బుల్లెట్లకు భయపడతామా? వైసిపి సిల్లీ ఫెల్లోస్ కి మరో సారి చెబుతున్నా. చిల్లర వేషాలు వద్దు. సాగనిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే వైసిపి కి అంతిమయాత్ర.

మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి

సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు 2,200 కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.  మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 

యువత భవితను దెబ్బతీసిన వైసీపీ

వైసీపీ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని వైసీపీ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.  నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోటార్లకు మీటర్లు పెడితే పగలగొట్టండి!

జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్, రైతు రథాలు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

పోలీసుల డబ్బూ కొట్టేసిన గజదొంగ

వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు.  పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కట్ చేసాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

బిసిల కోసం ప్రత్యేక రక్షణ చట్టం

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.  డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు.  దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.

మైనారిటీలకూ తప్పని చిత్రహింసలు

వైసీపీ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. 2014 లో బిజేపి తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అయినా ఏనాడూ మైనార్టీ ల పై ఒక్క దాడి జరగలేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. 2024 లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.

వినుకొండను అభివృద్ధి చేసింది టిడిపి!

వినుకొండ నియోజకవర్గాన్ని రూ.2,400  కోట్లతో అభివృద్ధి చేసింది టిడిపి. పల్నాడు ముద్దు బిడ్డ  జీవి. ఆంజనేయులు నేను మంత్రిగా ఉన్నప్పుడు నాతో నిధుల కోసం పోరాడేవారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, గ్రామాల్లో సిసి రోడ్లు, బ్రిడ్జిలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. వినుకొండని అభివృద్ధి చేస్తారని మీరు భారీ మెజారిటీతో బొల్లా బ్రహ్మనాయుడుని గెలిపించారు. కానీ ఆయన వినుకొండకి పొడిచింది ఏంటి? 4 ఏళ్ల క్రితం ఎక్కడ వినుకొండ ఎక్కడ ఉందో ఇప్పుడూ అక్కడే ఉంది. టిడిపి హయాంలో ప్రారంభించిన పనులకు రిబ్బన్ కట్టింగ్ చేస్తున్నాడు.

కబ్జాలరాయుడు ఎమ్మెల్యే బొల్లా

వినుకొండలో మైనార్టీ సోదరుడు ఫరీద్ కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 214 లో మూడు ఎకరాల భూమిని కబ్జా చేసాడు. ప్రశ్నించినందుకు ఫరీద్ మనవడు నాగూర్ వలీని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి చితకబాదారు. తెల్లపాడులో వైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీనుకి చెందిన ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేసాడు. వెంకుపాలెం వద్ద డైరీకి రోడ్డు వేసుకోవడానికి దళిత మహిళల కి చెందిన 1.50 ఎకరాల భూమిని కబ్జాచేసాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి సెంటు స్థలాల పేరుతో మ‌ళ్లీ ప్రభుత్వానికే  20 కోట్లకి అమ్మేసాడు. బ్రాహ్మణపల్లి రెవెన్యూ ప‌రిధిలో 170 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేశాడు. పసుపులేరు బ్రిడ్జి వద్ద 62 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించాడు.

వినుకొండలో బి ట్యాక్స్ బెడద

గుండ్లకమ్మ నది, వాగుల నుండి ఇసుక దోపిడి చేస్తున్నాడు. ప్రభుత్వ భూములు, చెరువుల్లో మ‌ట్టినీ దోచేస్తున్నాడు.  క‌బ్జాల రాయుడు క‌నుస‌న్నల్లోనే బియ్యం, మద్యం, గుట్కా మాఫియాలు న‌డుస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్న ఎమ్మెల్యేకి “బీ “టాక్స్ చెల్లించాల్సిందే. వినుకొండలో అపార్ట్మెంట్ నిర్మించాలంటే  “బీ”టాక్స్ క‌ట్టాల్సిందే. కబ్జాల రాయుడు చేతగాని వాడు. 4 ఏళ్లలో పీకింది ఏమి లేదు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములని అక్రమ రిజిస్ట్రేషన్లతో కొట్టేసి, వాటిపై వందల కోట్లు బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకుంటున్నాడు. వినుకొండ మున్సిపాలిటీని  ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలు ,దౌర్జన్యాలు, దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసాడు.  బొల్లాపల్లి మండలంలో  రెవెన్యూ రికార్డులు తారుమారు చేయించి 13 వేల ఎకరాలకు 8 వేల పాస్ బుక్‌లు ఇప్పించి 100 కోట్లు దోచేసాడు ఎమ్మెల్యే .ఈ క‌బ్జారాయుడుని ఓడించ‌క‌పోతే…వినుకొండ‌లో ఎవరి భూమీ మిగ‌ల‌దు. కొండ‌లు మింగేస్తాడు.. మ‌ట్టి, ఇసుక క‌నిపించ‌దు.

వరికపూడిశెల పూర్తిచేస్తాం!

ఫ్లోరైడ్ సమస్య గురించి నేను తెలుసుకున్నాను. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. బొల్లాపల్లి మండల తాగు, సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మిస్తాం. టిడిపి గెలిచిన మూడేళ్ల లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తాం.పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పూర్తిగా దెబ్బతిన్న రహదారుల స్థానంలో కొత్తవి నిర్మిస్తాం. గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యాములు నిర్మించి సాగు నీటి వ‌స‌తి క‌ల్పిస్తాం. వినుకొండలో  ముస్లిం మైనారిటీలకు షాదీ ఖానా నిర్మిస్తాం.90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ల‌బ్ధిదారుల‌కి అంద‌జేస్తాం. వినుకొండ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్  డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ భూముల్లో రైతుల‌కి ఎన్టీఆర్ జలసిరి బోర్లు, సోలార్ అనుసంధాన మోటార్లు వేయిస్తాం. వరి,మిర్చి,పత్తి,పొగాకు రైతులకు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం.

బొల్లా భూకబ్జాలపై సిట్ వేస్తాం!

కబ్జాల రాయుడు మారిన ఎమ్మెల్యే బొల్లా భూకబ్జాలపై ప్రత్యేక సిట్ వేస్తాం. భూములు అన్ని వెనక్కి తీసుకోని పేదలకు పంచేస్తాం. 9 నెలలు ఓపిక పట్టండి కబ్జాల రాయుడు కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. టిడిపి కార్యకర్తల జోలికి రావాలి అంటే భయపడే విధంగా చేస్తాను. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం. అందరి పేర్లు ఎర్ర పుస్తకం లో రాసుకుంటున్నా. పోరాడిన ప్రతి కార్యకర్తని ఆదుకుంటాం. కేసులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కువ కేసులు ఉన్న వారికి పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తాం. ప్రస్తుతానికి జేసీ దివాకర్ రెడ్డి గారి పై 74 కేసులు ఉన్నాయి. అయినా ఆయన తగ్గడం లేదు. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లు వినుకొండ లో ఉన్నా విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.

నారా లోకేష్ ను కలిసిన నూజెండ్ల మండల ప్రజలు

వినుకొండ నియోజకవర్గం ఉప్పలపాడులో నూజెండ్ల మండల రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కొత్త ఉప్పలపాడు, తలార్లపల్లి, గొల్లపాలెం, త్రిపురాపురం గ్రామాల్లో నాలుగేళ్లుగా మౌలిక సదుపాయాలు లేవు. సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. కొత్త ఉప్పలపాడు గ్రామంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాలుగు గ్రామాలకు సాగు, తాగు నీరు అందించాలని అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టనట్టు ఉంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామాలకు సాగు, తాగు నీరు అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ముఖ్యమంత్రి కు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదు. వైసీపీ ప్రభుత్వంలో సాగు,తాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయి. TDP పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేశాం. జగన్ సిఎం అయ్యాక టీడీపీ చేసిన ఖర్చులో నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదు.ఎత్తిపోతల పథకాలకు కరెంటుబిల్లులు కట్టలేక మూలనబెట్టిన దివాలాకోరు ప్రభుత్వం రాజ్యమేలుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కొత్త ఉప్పలపాడు, తలార్లపల్లి, గొల్లపాలెం, త్రిపురాపురం గ్రామాల సాగునీటి సమస్య పరిష్కరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన వినుకొండ పట్టణ ప్రముఖులు

వినుకొండ చెక్ పోస్టు సెంటర్ లో పట్టణ ప్రముఖులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో సిమెంట్ రోడ్లు, వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 14వవార్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం. మా వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వాహనమిత్ర పథకం అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ నిధులు ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తున్నారు. ఓటర్ల జాబితా వెరిఫికేషన్ సందర్భంగా వాలంటీర్ల జోక్యంతో అర్హత కలిగిన కొంత మంది ఓట్లు కోల్పోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావడం లేదు. అన్నా క్యాంటీన్లు తొలగించడం వల్ల పేదప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

నారా లోకేష్ స్పందిస్తూ

ఎపిలో కోట్లాదిమంది ప్రజల డాటాను దొంగిలించిన వైసీపీ . వాలంటీర్ల సాయంతో ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగించడం, లేని వైసిపి ఓట్లను చేర్పించడం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75,760కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ నిదులు రూ.28,147కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.5,355కోట్లు, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూ.5,400కోట్లు దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు. స్థానిక సంస్థల నిధులను దొంగిలించి పట్టణాలు, పంచాయితీలను అభివృద్ధికి దూరంచేశారు. కనీసం డ్రైనేజీల్లో పూడిక తీయలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన స్థానికసంస్థలను ఆర్థికంగా పరిపుష్టంచేసి మౌలికసదుపాయాలు కల్పిస్తాం. పేదల ఆకలితీర్చే అన్నక్యాంటీన్లను పునరుద్దరిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్లకు దామాషా పద్ధతిలో నిధులిచ్చి ఆర్థికంగా చేయూతనిస్తాం.

Also Read This Blog :From Town to Town: Naralokesh’s Padayatra Unveiled

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *