సంతనూతలపాడు నియోజకవర్గంలో లోకేష్ కు పూర్వస్వాగతం వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు దారిపొడవునా హారతులు పడుతూ యువనేతకు నీరాజనాలు
సంతనూతలపాడు: మూడురోజులపాటు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర… ఆదివారం సంతనూతలపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 163వరోజు పాదయాత్ర మార్కాపురం నియోజకవర్గం తలమళ్ల నుంచి ప్రారంభం కాగా, మర్రిచెట్లపాలెం వద్ద సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మర్రిచెట్లపాలెం శివార్లలో సంతనూతలపాడు ఇన్ చార్జి విజయకుమార్, బాపట్ల మాజీ ఎంపి శ్రీరాం మాల్యాద్రి, నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. భారీగజమాలలు, పూలవర్షంతో యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో మర్రిచెట్లపాలెం పరిసరాలు దద్దరిల్లాయి. అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ నినాదాలతో హోరెత్తించారు. Nara Lokesh ను కలిసేందుకు మహిళలు, యువతీయువకులు భారీగా తరలివచ్చారు. దారిపొడవునా యువనేతకు హారతులు పడుతూ నీరాజనాలు పలికారు. తలమళ్ల క్యాంప్ సైట్ లో కొండపి నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశమైన యువనేత, అనంతరం పొగాకురైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. తలమళ్ల నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్ర… గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు, మర్రిచెట్లపాలెం, బూదవాడ, రామతీర్థం మీదుగా చీమకుర్తి శివార్లలోని విడిది కేంద్రానికి చేరుకుంది. 163వరోజు యువనేత లోకేష్ 16.2 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2168.3 కి.మీ.ల మేర పూర్తయింది. సోమవారం సాయంత్ర చీమకుర్తి ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిర్వహించే బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు.
బ్యారన్ కు 50క్వింటాళ్ల అనుమతికి పోరాడతాం!
-ఎఫ్ డిఐల రాకతోనే పొగాకుకు మెరుగైన ధరలు
-రీసెర్చి సెంటర్లు ఏర్పాటుచేస్తాం…పెట్టుబడులు తగ్గిస్తాం
-పొగాకుకు ఇన్సూరెన్స్ అంశాన్ని పరిశీలిస్తాం
-పొగాకు రైతులతో సమావేశంలో యువనేత లోకేష్
మార్కాపురం: టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యారన్ కు 50 క్వింటాళ్లు అమ్ముకోవడానికి బోర్డు అనుమతి ఇచ్చేలా కేంద్రంతో పోరాడతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం తలమళ్లలో పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ గారు కందుకూరు లో పొగాకు బోర్డు ఏర్పాటు చేసారు. పొగాకు కు రేటు లేకపోతే కిలో కి అదనంగా రూ.5 ఇచ్చి ఆదుకుంది చంద్రబాబునాయుడు. డ్రిప్ తో సహా రైతుల కోసం అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేసాడు. మొక్క దగ్గర నుండి మందుల వరకూ అందించే విధంగా ప్రతి పంటకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ జోన్లు ఏర్పాటు చేసి రైతులకు సూచనలు ఇస్తాం. పొగాకులో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాల్సిన అవసరం ఉంది, అప్పుడే రైతుకి మేలు జరుగుతుంది.
పొగాకు షెడ్లకు సాయమందిస్తాం!
పొగాకు రైతుల పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతుల పెట్టుబడి తగ్గిస్తాం. డ్రిప్ ఇరిగేషన్, ఎరువులు తక్కువ ధరకే అందిస్తాం. సబ్సిడీలు, రుణాలు అందిస్తాం. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేయడం వలన దాని ప్రభావం రైతాంగం పై కూడా పడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తాం. పొగాకు రైతులు స్టాక్ పెట్టుకోడానికి రేకుల షెడ్డు నిర్మాణానికి సహాయం అందిస్తాం. పొగాకు కి ఇన్స్యూరెన్స్ కల్పించే అంశం పై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
వైసీపీ అసమర్థతవల్లే పెరిగిన ఆత్మహత్యలు
వైసీపీ అసమర్థ నిర్ణయాల వలన రైతులు ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 గా ఉంది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రైతుల తలసరి అప్పు రూ.70 వేలు ఉంటే వైసీపీ పాలనలో రైతుల తలసరి అప్పు రూ.2.50 లక్షలకు చేరింది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రూ.50 వేల లోపు ఉన్న రైతు రుణాలు అన్ని ఒకే సంతకంతో మాఫీ చేసాం. ఇన్ పుట్ సబ్సిడీ, సూక్ష్మ పోషకాలు, రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్ ఇలా అనేక పథకాలు టిడిపి హయాంలో రైతు సంక్షేమం కోసం అమలు చేశాం.
పొగాకు రైతులు మాట్లాడుతూ…
పొగాకు రైతుల పెట్టుబడి బాగా పెరిగింది. కేవలం 36.5 క్వింటాళ్లకు మాత్రమే బోర్డు అనుమతి ఇస్తుంది. కనీసం 50 క్వింటాళ్లు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే పొగాకు రైతుకు మంచి రేటు వస్తుంది. పొగాకు పంటకు ఇన్స్యూరెన్స్ లేక పోవడం వలన అకాల వర్షాలు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నాం. పొగాకు రైతులకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. ఎరువుల ధర కూడా పెంచేశారు. అకాల వర్షాలతో నష్టపోతున్నాం. పొగాకు రైతులకు మాత్రం జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదు. పొగాకు స్టాక్ పెట్టుకోడానికి షేడ్స్ ఏర్పాటు కోసం సబ్సిడీలు అందించాలి.
9నెలలు కష్టపడండి…గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా!
తప్పుడు కేసులు పెట్టడానికి 420 బ్యాచ్ సిద్ధంగా ఉంది
ధైర్యంగా పోరాడండి… మీకు అండగా నేను ఉంటా!
కొండపి నియోజకవర్గ కేడర్ తో నారా లోకేష్ సమావేశం
మార్కాపురం: నాలుగేళ్లలో చేసిన పోరాటం ఒకెత్తు..రాబోయే 9 నెలల్లో చేసే పోరాటం మరో ఎత్తు. 9నెలలు కష్టపడండి, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. దొంగ కేసులు పెట్టేందుకు 420 బ్యాచ్ సిద్ధంగా ఉంది, అప్రమత్తంగా ఉండాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తలమళ్ల క్యాంప్ సైట్ లో కొండపి నియోడజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలతో యువనేత లోకేష్ ఆదివారం సమావేశమయ్యారు. సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ TDP కార్యకర్తలను ఆర్థికంగా, అక్రమ కేసులతో జగన్ ఇబ్బంది పెట్టారు. కేసు పెడితే భయపడతారని అనుకుంటున్నారు. మీరు పోరాడండి..మీకు అండగా నేనుంటా. ఒక కరుడుగట్టిన నేరస్తుడు, సొంత బాబాయిని చంపిన క్రిమినల్ తో యుద్ధం చేస్తున్నాం. సీబీఐ తాజా ఛార్జ్ షీట్ తో బాబాయిని ఎవరు చంపారో తెలిసిపోయింది. గతంలో నారాసుర రక్త చరిత్ర అనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా… పనిచేసేవాళ్లను ప్రోత్సహిస్తా, కలసికట్టుగా పనిచేయండి. గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ గౌరవాన్ని నిలబెట్టింది. వైజాగ్ తో పోటీపడి ఇక్కడి ప్రజలు నాలుగు సీట్లు ఇచ్చారు. కొండపి ప్రజలు టీడీపీని దీవించి గెలిపించారు. మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వృథా చేయం. ప్రాంతాన్ని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాద్యత నేను తీసుకుంటా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టపడి పని చేస్తే 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తాం. యూనిట్, క్లస్టర్, బూత్ వారీగా ప్రతి ఒక్కరూ పని చేయాలి. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో ప్రజలకు భరోసా ఇస్తే మన వెంట నడుస్తారు. టీడీపీ వచ్చిన వెంటనే భవిష్యత్ కు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. 2024లో కొండపిలో హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నాం. భారీ మెజారిటీపై ఫోకస్ చేయాలి. కార్యకర్తలు ప్రతి ఇంటి తలుపుతట్టి వారికి అండగా నిలవండి. 2019కు ముందు గ్రామాల్లో ప్రజల కోసం అభివృద్ధి పనులు చేశారు. కానీ ఆ పనులకు చెల్లించాల్సిన బిల్లులు జగన్ రెడ్డి నిలిపేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే పనులు చేసిన వారికి ఈ ప్రభుత్వం పెట్టిన బకాయిలకు రూ.2 వడ్డీతో చెల్లిస్తాం. దామచర్ల సత్య నా తమ్ముడు లాంటి వాడు ..సత్య రాజకీయ భవిష్యత్ నేను చూసుకుంటాను. కొండపి మోడల్ ను రాష్ట్రమంతా కొండపిని ఆదర్శంగా తీసుకునేలా పనిచేయాలి. కొండపి నియోజకవర్గంలో పాదయాత్రను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
నారా లోకేష్ ను కలిసిన తలమళ్ల గ్రామస్తులు
మార్కాపురం నియోజకవర్గం తలమళ్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని చిన్నచెరువు, పెద్దచెరువుకు మూసి వాగు నుండి నీరు లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల గ్రామంలోని రైతులు వరిపంట పండించడానికి అవకాశమేర్పడుతంది. గ్రామంలో పూర్తిస్థాయిలో సైడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. చుట్టుప్రక్కల గ్రామాలన్నిటికీ నీటి కుళాయిలు ఉన్నాయి. మా గ్రామానికి లేవు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చిన్ననీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నీరు – ప్రగతి కార్యక్రమం కింద రూ.18,265 కోట్లు వెచ్చించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తలమళ్ల చెరువులకు నీరు అందేలా చర్యలు తీసుకుంటాం. గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు అందజేసి, స్వచ్చమైన తాగునీరు అందజేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన గోగినేనివారిపాలెం గ్రామస్తులు
పొదిలి మండలం గోగినేనివారిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉండడంతో కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. రామతీర్థం రిజర్వాయర్ నుండి మా గ్రామానికి నీటిని మళ్లించి తాగునీరు అందించాలి. గ్రామంలో సీసీరోడ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. టీడీపీ పాలనలో చేపట్టిన కొన్ని రోడ్ల పనులు వైసీపీ పాలనలో నిలిపేశారు. డ్రైనేజీలు, దోమల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిరుపేదలకు పక్కాఇళ్లు, ఇంటి పట్టాలు మంజూరు చేయడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
గ్రామీణ ప్రజలకు గుక్కెడు నీళ్లు అందించలేని చేతగాని ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్రప్రజల దౌర్భాగ్యం. గ్రామపంచాయితీలకు చెందిన 9వేల కోట్ల నిధులను దొంగిలించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ తో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఇంటింటికీ కుళాయి అందజేసి 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి గతవైభవం తెస్తాం.
నారా లోకేష్ ను కలిసిన ఉప్పలపాడు గ్రామస్తులు
పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో తాగునీటికి రామతీర్థం ప్రాజెక్టు నుండి నీరు అందడం లేదు. పక్క గ్రామాలకు వెళుతున్నాయి. వెయ్యి అడుగుల లోతు బోర్లు తీసినా మాకు నీరు రావడం లేదు. పొలాలకు వెలిగొండ ప్రాజెక్టు లేదా మూసీ నది నుండి పొలాలకు నీరు అందించాలి. గ్రామంలో డ్రైనేజీలు లేకపోవడంతో వర్షాకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రోడ్లు, ఇంటింటికీ కుళాయిలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
వైసీపీ దివాలాకోరు పాలన రాష్ట్రప్రజలకు శాపంగా మారింది. పంచాయితీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేకుండా చేశారు. రోడ్లపై తట్టమట్టి పోయలేని దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలో ఉంది. గత టిడిపి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశాం. టిడిపి అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ఉప్పలపాడుతోపాటు పరిసర గ్రామాలకు సాగు, తాగునీరు అందజేస్తాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
లోకేష్ ను కలిసిన కారుమంచి మేజర్ ఆయకట్టు రైతులు
సంతనూతలపాడు నియోజకవర్గం బూదవాడలో కారుమంచి మేజర్ ఆయకట్టు రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతి సమర్పించారు. కారుమంచి మేజర్ ఆయకట్టు కింద 16వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చీమకుర్తి మండలంలోని 13గ్రామాలకు సాగు, తాగునీరు ఆయకట్టు నుండి అందుతుంది. మేజర్ కాలువకు 2021 జనవరి9న గండిపడి తెగిపోయింది. దీనిపై ఆందోళన చేసినా ప్రభుత్వం సకాలంలో పట్టించుకోకపోవడంతో ఓ సీజన్ పంట నష్టపోవాల్సివచ్చింది. ఎన్.ఎస్.పీ కార్యాలయం ముందు రైతులమంతా ధర్నా చేస్తే, ప్లాస్టిక్ పట్టాల ద్వారా నీరు అందించే ఏర్పాటు చేశారు. మా పొలాలకు 100క్యూసెక్కుల నీరు కావాల్సి ఉండగా, కేవలం 20క్యూసెక్కుల నీరే అందుతోంది. ప్రజాప్రతినిధులు ఎవరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా రైతులు పంటలు వేసే అవకాశం లేకుండా పోయింది. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేట్లు, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. అడ్డగోలు దోపిడీ, కమీషన్లపై తప్ప ఈ ప్రభుత్వానికి మరే ఇతర ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ పై 68,294 కోట్లు ఖర్చుపెట్టాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టి, కారుమంచి మేజర్ కాల్వకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.
లోకేష్ ను కలిసిన గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
సంతనూతలపాడు నియోజకవర్గం రామతీర్థంలో ప్రకాశం జిల్లా గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రానైట్ ఫ్యాక్టరీలకు విద్యుత్ ఛార్జీని యూనిట్ కు రూ.2 తగ్గిస్తామని చెప్పి, తగ్గించకపోగా సర్ ఛార్జీల పేరుతో 1 రూపాయి అదనపు భారంమోపారు. వైసీపీ ప్రభుత్వం గ్రానైట్ ఫ్యాక్టరీలకు స్లాబ్ విధానం అమలుచేస్తోంది. దీనివల్ల ఫ్యాక్టరీ ఓనర్లు, క్వారీ ఓనర్స్ వద్దకు మైనింగ్ బిల్లులు కోసం వెళ్లాల్సిరావడంతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ విధానాన్ని రద్దుచేసి నేరుగా ఫ్యాక్టరీ ఓనర్లకు మైనింగ్ బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబునాయుడు హయాంలో ఇచ్చిన విధంగా గ్రానైట్ ఫ్యాక్టరీలకు రాయితీలు ఇవ్వాలి. గ్రానైట్ క్వారీల నుండి వచ్చే ముడిరాయిని 75శాతం స్థానిక ఫ్యాక్టరీలకే కేటాయించాలి. సేల్స్ ట్యాక్స్ అధికారులు గ్రానైట్ ఫ్యాక్టరీ తనిఖీలకు వెళ్లి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. గ్రానైట్ కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదు. మీరు అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలి. గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
వైసిపి అధికారంలోకి వచ్చాక గ్రానైట్ పరిశ్రమదారులపై కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. తమపార్టీవారు తప్ప రాష్ట్రంలో మరెవరూ వ్యాపారం చేయకూడదన్నట్లుగా తప్పుడు విధానాలు అవలంభిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పాత గ్రానైట్ పాలసీని తెచ్చి పరిశ్రమదారులకు చేయూతనిస్తాం. ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్చగా పరిశ్రమదారులు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తాం. ముడిరాయి విషయంలో స్థానిక గ్రానైట్ ఫ్యాక్టరీలకు ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకుంటాం. గ్రానైట్ కార్మికుల వైద్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేపడతాం.
Also Read This Blog :From Village to Vision: Nara Lokesh’s Padayatra Expedition
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh