
మార్కాపురం శివార్లలో యువగళం జనసంద్రంపూర్ణకుంభంతో యువనేతకు ఘనస్వాగతం
హరతులు, పూలవర్షంతో ముంచెత్తిన అభిమానులునేడు పొదిలిలో బహిరంగసభ, లోకేష్ ప్రసంగం
మార్కాపురం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 161వరోజు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసంద్రాన్ని తలపించింది. కనిగిరి నియోజకవర్గంలో పూర్తిచేసిన పెద్దారికట్ల శివార్లలో మార్కాపురంలోకి ప్రవేశించిన పాదయాత్రకు కనీవినీ ఎరుగనిరీతిలో ఘనస్వాగతం లభించింది. మార్కాపురం ఇన్ చార్జి కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలలతో యువనేతను సత్కరించారు. వేలాదిగా తరవచ్చిన ప్రజలతో పెద్దారికట్ల రోడ్లు కిటకిటలాడాయి. పాదయాత్ర దారిలో యువనేతను అభిమానులు పూలవర్షంతో ముంచెత్తారు. భారీ స్వాగత ద్వారాలు, బాణా సంచామోతలతో పెద్దారికట్ల హోరెత్తింది. మహిళలు హారతులు పడుతూ, దిష్టితీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. లోకేష్ తో ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. వివిధవర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. పాదయాత్రకు బయలుదేరే ముందుకు ఎర్రఓబునపల్లి క్యాంప్ సైట్ లో కమ్మసామాజికవర్గీయులతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఎర్రఓబునపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెద్దారికట్ల, చిన్నారికట్ల, కంభాలపాడు మీదుగా పొదిలి శివారు పోతవరం విడిది కేంద్రానికి చేరుకుంది. 161వరోజు యువనేత లోకేష్ 16.4 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2136.7 కి.మీ. మేర పూర్తయింది. శనివారం పొదిలి పాతబస్టాండులో నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తారు.
కమ్మలపై కావాలనే తప్పుడు ప్రచారం
కేవలం అణచివేత కుట్ర తోనే అక్కడ కమ్మ సామాజికవర్గపై జగన్ విషం చిమ్ముతున్నాడు, జగన్ గల్లీ నుండి ఢిల్లీ వరకూ టిడిపి హయాంలో 37 మందిలో 35 మంది కమ్మ సామాజికవర్గం వారికి ప్రమోషన్లు ఇచ్చారని అసత్య ప్రచారం చేసాడు. గవర్నర్ కి, రాష్ట్రపతి కి అబద్ధాలు చెప్పిన వ్యక్తి జగన్. టిడిపి హయాంలో ప్రమోషన్లు పొందిన 37 మంది డిఎస్పీల్లో కేవలం 5 గురు మాత్రమే కమ్మ సామాజికవర్గం వారు. మిగిలిన వాళ్లలో ఎక్కువ ఎస్సీ, బిసి సామాజికవర్గంకి చెందిన వారే ఉన్నారు. చంద్రబాబు రాముడు, రాజనీతి పాటిస్తారు. అందుకే అనేక అసత్య ఆరోపణలు చేసినా కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు. నేను ఎవరిని వదిలిపెట్టను. అసత్య ఆరోపణలు చేసిన అందరి పైనా చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా పోరాడతాను.
అమరావతిపై నాలుక మడతేశాడు!
రాజధాని గురించి అసెంబ్లీ లో జరిగిన చర్చ లో అన్ని ప్రాంతాలకు మధ్య లో ఉండాలి, 30 వేల ఎకరాలు ఉండాలి అని మాట్లాడాడు. అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్, అధికారంలోకి వచ్చిన వెంటనే మాటతప్పి, మడమతిప్పాడు. మూడు రాజధానులు అంటూ విశాఖ ని క్రైం క్యాపిటల్ గా మార్చేశాడు. వైసిపి ఎంపి కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. కర్నూలు లో ఒక్క ఇటుక పెట్టలేదు. అమరావతి కి భూములు ఇచ్చిన వారిలో ఎక్కువ ఎస్సీలు ఉన్నారు. 4 ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో అమరావతి విస్తరించి ఉంది. అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్, పింక్ డైమండ్, 6 లక్షల కోట్ల అవినీతి అన్నారు. ఒక్క ఆరోపణ జగన్ నిరూపించలేకపోయాడు. 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ కి చంద్రబాబుని, నన్ను ఒక్క రోజైనా జైలు లో పెట్టాలనే ఆశ ఉంది.
టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు!-కమ్మ సామాజికవర్గీయుల ఆవేదన
కమ్మ సామాజికవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ… గ్రామాల్లో మమ్మల్ని టార్గెట్ చేసి మరీ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వ్యాపారాలు చేసుకునే కమ్మ సామాజికవర్గం ప్రతినిధులను ఇబ్బందులు పెడుతున్నారు. కమ్మ సామాజికవర్గాన్ని మాత్రమే కాదు…ఎస్సీ, బిసి, మైనార్టీలు, ఎస్టీలు అందరూ బాధితులే. టిమీరు దానిని ధీటుగా ఎదుర్కోలేకపోయారు. కమ్మ సామాజికవర్గంలో వెనుకబడిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కమ్మ కార్పొరేషన్ పెట్టాడే తప్ప నిధులు, విధులు లేవు. వారికి టిడిపి ప్రభుత్వం వచ్చాక సహాయం అందించాలి. కనిగిరి ఇంఛార్జ్ ఉగ్రనరసింహ రెడ్డి మాట్లాడుతూ… కమ్మ సామాజికవర్గంలో కూడా పేదలు ఉన్నారు.వారిని కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.
నారా లోకేష్ ను కలిసిన పెద్దారికట్ల గ్రామస్తులు
మార్కాపురం నియోజకవర్గం పెద్దారికట్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో చాలా సంవత్సరాల నుండి త్రాగునీటి సమస్య ఉంది. తాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉండడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నాం. మా గ్రామంలో సీసీరోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సైడు కాలువలు లేకపోవడంతో వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. ముత్తరాజుపాలెం నుండి బాపతిపల్లి, గౌడబజారు నుండి గుంటూవారిపల్లి, కర్నావారి బజారు నుండి గరుంటువారిపల్లి, హరిజనపాలెంకు రోడ్లు సరిగా లేవు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
గత ఎన్నికల సమయంలో బుగ్గలునిమురుతూ ముద్దులుపెడుతూ ప్రజలను వంచించిన జగన్మోసపురెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజలను పూర్తిగా గాలికొదిలేశాడు. విధ్వంసక పాలన కారణంగా గత నాలుగేళ్లుగా ప్రజలు నరకం చూస్తున్నారు. తనను ఎన్నుకున్న ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని అసమర్థుడు జగన్ రెడ్డి. గత టిడిపి ప్రభుత్వ హయంలో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా గ్రామాల్లో స్వచ్చమైన తాగునీరు అందించాం. ఎపి చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు నిర్మించాం. మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతిఇంటికీ కుళాయి అందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాలకు గతవైభవం కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన చిన్నారికట్ల గ్రామస్తులు
మార్కాపురం నియోజకవర్గం చిన్నారికట్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో తాగునీరు దొరకని గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. TDP అధికారంలో ఉండగా ట్యాంకర్ల ద్వారా సకాలంలో మంచినీరు అందించేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ట్యాంకర్ యజమానులకు బిల్లులు ఆపేసి కక్షసాధిస్తున్నారు. గ్రామంలో 2వేల ఎకరాలు పోరంబోకు, ఇతర పొలాలు ఉన్నాయి. ఈ భూములను అధికారపార్టీ నాయకులు ఆక్రమించి పేదవాళ్లను భయపెడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఖాళీభూములను పేదలకు ఇవ్వాలి. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. టీడీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు నిలిపేశారు. వైసీపీ అరాచకాలను ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
సంక్షేమ పథకాలకు వైసిపి వారికి మాత్రమే ఇస్తూ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అడ్డగోలు దోపిడీ తప్ప ప్రజాసమస్యలపై దృష్టిసారించిన పాపాన పోలేదు. ప్రజలకు గుక్కెడు నీళ్లందించలేని దివాలాకోరు ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటుచేసి వైసిపి దొంగలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతాం. వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. పేదలందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తాం, అమాయకులపై తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన కంభాలపాడు గ్రామస్తులు
మార్కాపురం నియోజకవర్గం కంభాలపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామాన్ని పొదిలి నగర పంచాయతీలో కలపడం వల్ల ఉపాధిహామీ పథకం పనులకు దూరమయ్యాం. మాకు ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి. గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు అందించి తాగునీరందించే ఏర్పాటుచేయాలి. ప్రభుత్వ ఇంటి స్థలాలు శ్మశానం ప్రక్కనే ఇచ్చారు. ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలి. గ్రామంలో వీధిలైట్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. వెలిగొండ కాలువ ద్వారా మా గ్రామానికి నీరు అందించాలి. మా గ్రామంలో కొంతమందికి చర్మకారుల పెన్షన్లు రద్దు చేశారు. వాటిని పునరుద్దరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
కేవలం పన్నుల బాదుడుకోసమే ప్రభుత్వం శివారు గ్రామాలను పట్టణాల్లో కలిపింది. దివాలాకోరు పాలనతో పట్టణాల్లో బ్లీచింగ్ పౌడర్, కరెంటు బిల్లులు కట్టడానికి నిధుల్లేని దుస్థితి నెలకొంది. సెంటుపట్టాల పేరుతో 7వేల కోట్లు దోచుకున్న పేదలకు ఆవాసయోగ్యం కాని స్థలాలను అంటగట్టడం దారుణం. పట్టణాల్లో విలీనంచేసిన శివారు గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పథకం వర్తింపుపై కేంద్రానికి లేఖరాస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చాక పేదలకు పక్కాఇళ్లు, ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసిన పెన్షన్లన్నీ పునరుద్దరిస్తాం.
Also Read This Blog :Paving the Way: Nara Lokesh’s Padayatra for a Brighter Tomorrow
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh